IPS officer Ravi Sinha: సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా జూన్ 19న భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా నియమితులైనట్లు సెంట్రల్ పర్సనల్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Ravi Sinha appointed RAW chief: సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా జూన్ 19న భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కొత్త చీఫ్‌గా నియమితులైనట్లు సెంట్రల్ పర్సనల్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కొత్త చీఫ్‌గా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారి రవి సిన్హా జూన్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం సమంత్ గోయల్ RAW చీఫ్‌గా ఉన్నారు.
రవి సిన్హా RAW తదుపరి చీఫ్..
భారత గూఢచార సంస్థ RAW కొత్త చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా సోమవారం నియమితులైనట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ సమాచారం ప్రకారం, 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఛత్తీస్‌గఢ్ కేడర్ అధికారి అయిన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటేరియట్‌లో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నియామకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిన్హాను రా కొత్త చీఫ్‌గా రెండేళ్ల పదవీకాలానికి నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
జూన్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు..
జూన్ 30, 2023న తన పదవీకాలాన్ని పూర్తి చేయనున్న సమంత్ కుమార్ గోయెల్ స్థానంలో సిన్హా నియమించబడ్డారని ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరున రా చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
