న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి అస్వవ్థతకు గురయ్యారు. ఆమెను కుటుంబసభ్యులు ఎయిమ్స్ కు తరలించారు.

సుష్మాస్వరాజ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే  కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ వెంటనే ఎయిమ్స్ కు చేరుకొన్నారు. ఎయిమ్స్ లో సుష్మాస్వరాజ్ కు చికిత్స అందిస్తున్నారు. 

మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఎయిమ్స్ కు తరలించారు.ఎయిమ్స్ లోని అత్యవసర విభాగంలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.  నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానిగా పనిచేసిన సమయంలో సుష్మా స్వరాజ్ ఆయన మంత్రివర్గంలో విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

2019లో సుష్మా స్వరాజ్ పోటీ చేయలేదు. నరేంద్ర మోడీ ప్రధానిగా రెండో దఫా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు.గత ఐదేళ్లుగా తనకు మంత్రిగా బాధ్యతలు కల్పించినందుకు ఆమె మోడీకి ధన్యవాదాలు తెలిపారు.