తమిళనాడు రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు లా గణేశన్ ను మణిపూర్ గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు.ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్రపతి కార్యాలయం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత లా గణేశన్ మణిపూర్ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.మణిపూర్ గవర్నర్ గా పనిచేసిన నజ్మా హెప్థుల్లా రిటైర్ అయిన తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో మణిపూర్ గవర్నర్ గా లా గణేశన్ ను నియమించారు.

ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఇవాళ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన నజ్మాహెప్థులల్లా రాజ్ భవన్ ను విడిచివెళ్లారు. అదే రోజున సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ కు మణిపూర్ గవర్నర్ బాధ్యతలను అప్పగించారు.