Maharashtra Political Crisis:  మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ వీడ‌టం లేదు. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో గౌహతి నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లారు. అక్కడే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోపాటు మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆయన రహస్యంగా భేటీ అయినట్లు స‌మాచారం. 

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ వీడ‌టం లేదు. శివ‌సేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే చేస్తున్న తిరుగుబాటు.. రోజురోజుకో మలుపు తిరుగుతోంది. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను ఒక్క‌చోట నుంచి మార్చుతూ.. క్యాంపు రాజ‌కీయాలు చేస్తున్నారు. 

తాజాగా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో గౌహతి నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లిన‌ట్టు.. ఆ స‌మ‌యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో రహస్యంగా భేటీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.



మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌తో చర్చలు జరిపిన తర్వాత.. మిస్టర్ షిండే గౌహతికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. గౌహతిలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో 38 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు ఉన్నట్టు టాక్. వారిలో.. మిస్టర్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలు థాకరే తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ వీరికి అనర్హత నోటీసును పంపించారు. ఈ నోటీసుల‌పై సోమవారం సాయంత్రంలోగా స్పందించి ముంబైలో హాజరు కావాలని కోరారు.


మంత్రి షిండే మరియు తిరుగుబాటు ఎమ్మెల్యేలు త‌మ మాజీ భాగస్వామి బిజెపితో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని, వారితో క‌లిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని, తమకు సంఖ్యాబలం ఉందని చెప్పుకోవాలని కోరుకుంటున్నారు. తిరుగుబాటుదారులు ఇప్పటికే "శివసేన బాలాసాహెబ్" అనే కొత్త విభాగాన్ని ప్రకటించారు. తామే నిజ‌మైన శివ‌సేన నాయ‌కుల‌మ‌ని ప్ర‌క‌టించుకున్నారు. కానీ మహా వికాస్ అఘాడి ( సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్) కూటమి మాత్రం తిరుగుబాటుదారులను ఫ్లోర్ టెస్ట్ కోసం తిరిగి రావాలని చెప్పాయి.

మరోవైపు.. భవిష్యత్తు కార్యాచరణపై ఏక్‌నాథ్‌ షిండే వర్గం స‌త‌మ‌త‌వుతోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై వారికి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో వారు మ‌రో రెండు రోజులు గౌహతిలోని 5 స్టార్‌ హోటల్‌లో ఉండనున్నారు. ఈ మేరకు హోట‌ల్ యాజ‌మాన్యాన్ని రెండు రోజులు పొడిగించాలని కోరిన‌ట్టు తెలుస్తోంది. 

16 మంది తిరుగుబాటుదారులను అనర్హులుగా ప్రకటించడం. మిగిలిన వారిని ఎన్నికలను ఎదుర్కోకుండా నిరుత్సాహపరచడం. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ వారిని అస్సాం నుండి తిరిగి వచ్చేలా చేయడం సేన నాటకంగా కనిపిస్తోంది. అస్సాంలో BJP ఈశాన్య ఎన్నికల వ్యూహకర్త హిమంత బిస్వా శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతని సన్నిహితులు ఉన్నారు. ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లో లాజిస్టిక్స్ చూసుకుంటున్నారు.