Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫీ పిచ్చి.. 120అడుగుల లోతు లోయలో పడ్డ కొత్తజంట.. పెళ్లి వాయిదా ..

సెల్ఫీ పిచ్చితో ఓ జంట పెళ్లి వాయిదా పడింది. పెళ్లిపీటలెక్కాల్సిన వారు శవపేటికల్లోకి వెళ్లిపోయేవారు. తృటిలో ప్రమాదం తప్పి.. చిన్న గాయాలతో బయటపడ్డారు.

Selfie crazy, Newly married couple fell in 120 feet deep water valley, wedding postponed in kerala
Author
First Published Dec 10, 2022, 6:50 AM IST

కేరళ : అందమైన ప్రదేశాలకు వెళ్లడం ఆహ్లాదంగా ఉంటుంది.  అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత  అందులో మనల్ని పండించుకోవడం..  ఆనందంతో కలిసి ఒక్క ఫోటో అయినా దిగాలని ఉవ్విళ్లూరడం సహజమే. దీంతో సెల్ఫీ మోజు రోజురోజుకు పెరిగిపోతోంది. ఎక్కడికి వెళ్ళినా.. సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు. దీంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండడం లేదు. అలా అలా అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ జంట సెల్ఫీ మోజుతో, తృటిలో ప్రాణాపాయం తప్పి.. ఆస్పత్రి పాలైంది. ఇది కేరళలో చోటు చేసుకుంది.

కేరళ, కొల్లాం జిల్లాలోని పరువూరుకు చెందిన విను కృష్ణన్ కు…కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్ కుమార్ కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 9 శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. కానీ అంతలోనే  విషాదం చోటుచేసుకుంది.పెళ్లి వేడుకల్లో సాధారణంగా బరువు వరకు తమ కుటుంబ సభ్యులతో గురువారం నాడు స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి పూజలు చేయడానికి వెళ్లారు.

ల‌వ్ జిహాద్ కు వ్య‌తిరేకంగా చ‌ట్టం తెచ్చే యోచ‌న‌లో మ‌హారాష్ట్ర స‌ర్కారు.. : దేవేంద్ర ఫ‌డ్న‌వీస్

పూజలు పూర్తి చేసి, మొక్కులు తీర్చుకుని, దైవ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడికి దగ్గరలోనే ఒక క్వారీ ఉందని తెలిసి…అందరూ కలిసి చూడటానికి వెళ్లారు. వారి వల్ల ఏర్పడిన గుంటల్లో నీరు నిండిపోయి,  ఆ ప్రదేశం అంతా అద్భుతంగా ఉంది.దీంతో అక్కడ ఓ సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది వారికి. అంతే..  తెల్లారితే కొత్త జీవితం కలిసి మొదలు పెట్టబోతున్న విని కృష్ణన్, శాండ్రా  క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకుందామని అనుకున్నారు. జాగ్రత్తగా క్వారీ చేరి దాకా వెళ్లారు. సెల్ఫీ కి స్టిల్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

అంతలోనే.. ఒక్కసారిగా  అనుకోని ప్రమాదం జరిగింది. క్వారీ అంచున నిలబడ్డ శాండ్ర కాలుజారి  120 అడుగుల లోతులో ఉన్న ఆ లోయలో పడిపోయింది. వెంటనే  వరుడు వినుకృష్ణన్ ఆమెను కాపాడేందుకు ఆమెతో పాటే దూకేశాడు. నీళ్ళలో మునిగి పోతున్న శాండ్రాను పట్టుకుని, కాపాడి ఓ బండరాయిపై కూర్చోబెట్టాడు. వీరి పడిపోవడాన్ని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి గమనించాడు.  వెంటనే  మిగతా వారికి,  పోలీస్ లకు సమాచారం ఇచ్చాడు. 

అతడిచ్చిన సమాచారం మేరకు సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో వధూవరులిద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని కొల్లాం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.  అక్కడ చికిత్స పొందుతున్నారు. దీంతో శుక్రవారం నాడు జరగాల్సిన పెళ్లి కాస్త వాయిదా పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios