బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు  చేసుకుంది. ఆనంద్ విహార్ నుంచి జోగ్‌బనీ వెళుతున్న సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌ హాజీపూర్ వద్ద పట్టాలు తప్పింది. తెల్లవారుజామున 3.52 గంటల సమయంలో ప్రయాణికులు గాఢనిద్రలో ఉండటంతో ఏం జరిగిందో లేదో తెలిసేలోపు అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. 

ఈ ప్రమాదంలో 9 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బాధితుల సహాయార్ధం రైల్వేశాఖ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోన్పూర్‌ 06158221645, హజీపూర్‌ 06224272230, బరౌనీ 06279232222 ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది. తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో శిధిలాల కింద మరింత మంది ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.