Asianet News TeluguAsianet News Telugu

ఆమె ప్రేమికురాలా ? లేక గూఢచారా? సీమ హైదర్ పై పలు అనుమానాలు.. నిఘా పెంపు..

పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI)తో సీమా హైదర్‌కు సంబంధాలు ఉండొచ్చనే అనుమానం వెలువడుతోంది. దీంతో ఆమెపై ఏటీఎస్, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) నిఘా పెంచాయి.  ఆమెను ఐఎస్ఐ గూఢచారి అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా  అనుమానిస్తోంది. 

Seema Haider Confronts Her Motive In Front Of ATS KRJ
Author
First Published Jul 20, 2023, 12:57 AM IST

PUBG గేమ్ ద్వారా పరిచయమైన యువకుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన మహిళ  సీమా హైదర్ (Seema Haider). అయితే.. ఆమె వ్యవహారం శైలిలో .. ఆమె పద్దతులపై కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సీమా హైదర్‌ విషయం నేడు  చర్చనీయాంశంగా మారింది.  సీమా హైదర్ PUBG ద్వారా సచిన్‌తో స్నేహానికి నాంది పలుకుతున్నప్పటికీ, ఆమె ఢిల్లీ NCRలోని చాలా మంది యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు కూడా పంపినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI)తో సీమా హైదర్‌కు సంబంధాలు ఉండొచ్చనే అనుమానం వెలువడుతోంది. దీంతో ఆమెపై ఏటీఎస్, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) నిఘా పెంచాయి.  ఆమెను ఐఎస్ఐ గూఢచారి అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా  అనుమానిస్తోంది. ఇంట‌రాగేష‌న్‌లో సీమ కొన్ని విష‌యాలు చెప్ప‌డంతో ప‌లు ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి.

సీమ హైదర్ పై పలు అనుమానాలు..

>> సీమా ఆర్మీ ఆఫీసర్‌కి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపింది, కానీ ఎందుకు చెప్పలేదు.

>> పాస్‌పోర్ట్ మే 8న జారీ చేయబడింది. అయితే ఆమె మే 10వ తేదీనా  పాకిస్థాన్‌ ను విడిచి ఎలా వచ్చింది? 

>> నేపాల్ పాకిస్థాన్ నుంచి డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇండియాలో అడుగుపెట్టిందని, అలాంటప్పుడు నేపాల్‌లో సిమ్ ఎందుకు విసిరింది? .

>> రెండు మూడు రోజుల్లోనే 70 వేల విలువైన మొబైల్ ఎందుకు పారేసారు? 

>> పాకిస్థాన్‌లోని ఇంటిని 12 లక్షలకు అమ్మి ఆ డబ్బుతో ఇండియాకు వచ్చానని సీమ మొదటి నుంచి చెబుతోంది. అయితే ఆ ఇంటి అమ్మకం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది.

>> సీమ ఎవరి ద్వారా ఇంటిని విక్రయించింది? ఆ డబ్బు ఏం చేసింది. నేరుగా బ్యాంకులో వేశారా?  లేదా నగదు రూపంలో ఇచ్చారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి..

>> పాస్‌పోర్ట్ , టిక్కెట్‌ను పొందడానికి ఆమె సరిహద్దు ఏజెంట్‌ను ఎలా చేరుకుంది ?  దీనికి స్పష్టమైన సమాధానం లభించలేదు.

>> నేపాల్ నుంచి సీతామర్హి (బీహార్) మీదుగా భారత్‌లోకి చొరబడినట్లు సీమా అంగీకరించింది. అయితే.. సీమకు సాయం ఎవరు చేశారు. ఆమె అక్కడికి ఎలా వచ్చింది.?

>> ఆమె తండ్రి, సోదరుడు పాకిస్థాన్ ఆర్మీలో ఉన్నారని పలు అనుమానాలు ఉన్నాయి.

>> గుర్తింపు కార్డు ప్రకారం, సీమా వయస్సు కేవలం 21 సంవత్సరాలు, సీమా విచారణలో తన వయస్సు 27 సంవత్సరాలు , నలుగురు పిల్లలు తనవేనని చెప్పారు. వయసులో ఇంత తేడా ఎందుకో ఆమె చెప్పలేకపోయింది.

అసలేం జరిగింది..? 

పాకిస్థాన్‌లోని కరాచీ నివాసి సీమా హైదర్, రబూపురా నివాసి సచిన్‌తో పబ్‌జి ఆడుతున్నప్పుడు పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తన ప్రేమను పొందడానికి, సీమా హైదర్ అక్రమంగా భారతదేశ సరిహద్దులోకి ప్రవేశించి మే 13న రబుపురాలో నివసించడం ప్రారంభించింది. జులై 6న సమాచారం అందుకున్న పోలీసులు సీమా, సచిన్‌లను అరెస్టు చేశారు. సీమ నెలన్నర రోజులుగా అక్రమంగా రబూపురలో మకాం వేసి స్థానిక ఏజెన్సీకి కూడా ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం ఆమె కోర్టు నుంచి బెయిల్ పొందడంతో రబూపురాలోని సచిన్ ఇంట్లో నివసిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios