ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గుర్తుతెలియని వ్యక్తి చెంపదెబ్బ కొట్టడంతో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గుర్తుతెలియని వ్యక్తి చెంపదెబ్బ కొట్టడంతో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. కేజ్రీ వాహనం చుట్టూ పోలీసులు, కమెండోలు కనిపిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీనగర్‌లో రోడ్‌షో నిర్వహిస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ జీప్‌పైకి ఓ వ్యక్తి ఎక్కి ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆప్ నేతలు...ఇది ప్రత్యర్ధుల కుట్రని, ముఖ్యమంత్రి భద్రతను పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ పోలీసులపై ధ్వజమెత్తారు.

కేజ్రీవాల్‌ను చంపేయాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఆప్ నేతల విమర్శలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. మరోవైపు కేజ్రీవాల్‌పై దాడి చేసిన వ్యక్తిని సురేశ్ అనే వ్యక్తిగా గుర్తించి, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సురేశ్‌పై ఐపీసీ సెక్షన్ 323 కింద అభియోగాలు నమోదు చేశారు.