బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి.  స్పీకర్ తీసుకొన్న నిర్ణయాన్ని నిరసిస్తూ రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును బుధవారం నాడు ఆశ్రయించారు. ఈ విషయమై రేపు విచారణ జరగనుంది.

అసంతృప్త ఎమ్మెల్యేలు బస చేసిన ముంబై హోటల్‌లోకి  కర్ణాటక మంత్రి డికె శివకుమార్ ను పోలీసులు అనుమతించడం లేదు. డికె శివకుమార్ ను కలిసేందుకు ఎమ్మెల్యేలు సిద్దంగా లేరు. మరో వైపు తాను రెబెల్స్ ఎమ్మెల్యేలను  కలవకుండా తిరిగి వచ్చేదిలేదని ఆయన స్పష్టం చేశారు. 

హోటల్ బయటే మంత్రి శివకుమార్  టిఫిన్ చేశారు. శివకుమార్ అక్కడి నుండి వెళ్లిపోవాలని  బీజేపీ కార్యకర్తలు హోటల్ వద్ద నిరసనకు దిగారు.  మరో వైపు సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగుళూరు విధానసభ ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. ఇవాళ మధ్యాహ్నం స్పీకర్‌ను , గవర్నర్ ను మాజీ సీఎం యడ్యూరప్ప కలవనున్నారు.