దేశంలో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మూడు లక్షలకు చేరువుగా రోజువారి కేసులు నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.  గడచిన 24 గంటల్లో 13. 56 లక్షల పరీక్షలు చేయగా.. 2,73,810మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దేశంలో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మూడు లక్షలకు చేరువుగా రోజువారి కేసులు నమోదవడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. గడచిన 24 గంటల్లో 13. 56 లక్షల పరీక్షలు చేయగా.. 2,73,810మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీంతో దేశంలో వరుసగా ఐదో రోజూ రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. కొత్తగా 1,44,178 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.

దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కి చేరింది. రికరీ రేటు 86.62 శాతానికి తగ్గింది. ఇక కరోనా మరణాలు అంతకు ముందురోజు 1,501 గా నమోదు కాగా, ఆదివారం ఆ సంఖ్య ఇంకా పెరిగింది. మొత్తము 1,619 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,78,769కి చేరింది.

దేశంలో ఇదీ పరిస్ధితి: ప్లీజ్ నా తమ్ముడికి ఓ బెడ్ ఇవ్వండి, అధికారులకు కేంద్ర మంత్రి అభ్యర్ధన...

ఇక మరణాల రేటు 1.20 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య19,29,329 పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గడచిన 24 గంటల్లో 12.30 లక్షల మందికి పైగా టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 12,38.52,566కి చేరింది.

మహారాష్ట్రలో కరోనా వైరస్ పరిస్థితులు ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 68,631 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 503మరణాలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 25,462కేసులు నమోదు కాగా, 161 మంది మహమ్మారి ధాటికి బలైయ్యారు. కాగా దేశంలో వైరస్ వ్యాప్తి ఉధృతమైన నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.