వామ్మో.. కారు ఢీకొనడంతో ముక్కలు ముక్కలైపోయిన స్కూటీ..
ఓ కారు వేగంగా స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఆ స్కూటీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. దానిని నడుపుతున్న మహిళ కూడా పైకి ఎగిరి కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యయాయి. ఈ ఘటన హర్యానాలోని ఫతేబాద్ లో జరిగింది.

హర్యానాలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఆ స్కూటీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ప్రమాదం ఫతేబాద్ లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆ స్కూటీ నడుపుతున్న మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వివరాలు ఇలా ఉన్నాయి. ఫతేబాద్ లోని ఓ కూడలిలో కారు వేగంగా వస్తోంది. అదే సమయంలో మరో వైపు నుంచి రోడ్డు దాటేందుకు స్కూటీపై ఓ మహిళ ప్రయత్నిస్తోంది. అయితే అటు నుంచి వచ్చే కారు రోడ్డు దాటుతున్న స్కూటీనీ వేగంగా ఢీకొట్టింది. దీంతో అక్కడ సారిగా టూ వీలర్ ముక్కలు ముక్కలైపోయింది. ఆ వాహనం భాగాలన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. అలాగే ఆ మహిళ కూడా ఎగిరి కిందపడింది.
ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడ నిలపలేదు. స్థానికులు దాడి చేస్తారనే భయంతో వాహనంతో సహా అతడు పారిపోయాడు. కిందపడిన ఆ యువతిని వెంటనే స్థానికులు తక్షణ వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారిపోయిన కారు డ్రైవర్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలు ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.