చనిపోయిన వ్యక్తిని పశ్చిమ ఢిల్లీలోని పీరాగర్హి నివాసి రాజేష్ మల్లిక్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం శాస్త్రి భవన్ లోని గేట్ నెం.2 వద్ద లభ్యమైందని పోలీసులు చెప్పారు.
సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న శాస్త్రవేత్త(55) ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీలోని శాస్త్రి భవన్ లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన వ్యక్తిని పశ్చిమ ఢిల్లీలోని పీరాగర్హి నివాసి రాజేష్ మల్లిక్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం శాస్త్రి భవన్ లోని గేట్ నెం.2 వద్ద లభ్యమైందని పోలీసులు చెప్పారు.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ) అమృత గుగులోత్ మాట్లాడుతూ, "శాస్త్రి భవన్ నుండి దూకిన వ్యక్తికి సంబంధించిన సమాచారం అందింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ వ్యక్తిని రాకేష్ మల్లిక్‌గా గుర్తించారు." అని చెప్పారు.
"పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ నుండి అధికారుల బృందం, అంబులెన్స్‌తో క్రైమ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. తదుపరి విచారణ జరుగుతోంది.చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని డిసిపి జోడించారు. కాగా.. ఆయన మృతికి సంబంధించిన విషయాలు, కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
