ముంబైలో దారుణం జరిగింది. భార్యతో చిన్న మనస్పర్థతో ఓ యువశాస్త్రవేత్త ఉరేసుకుని చనిపోయాడు. ట్రోంబేలోని బార్క్ క్వార్టర్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులకు సమాచారం అందడంలో వెంటనే వచ్చిన వారు మృతుడిని అనుజ్ త్రిపాఠిగా గుర్తించారు. ఇతను ముంబైలోని ట్రోంబేలో ఉన్న బార్క్ బయో-కెమ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. డిపార్ట్ మెంట్  క్వార్టర్స్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లు ఉన్నారు.

మొదట యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టాడు. సీనియర్ ఇన్స్పెక్టర్ సిద్దేశ్వర్ గోవ్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం అనుజ్ కు అతని భార్యకు చిన్న వాదన జరిగింది.

ఇద్దరు పిల్లలు ఆహారం తినిపించే విషయంలో ఇద్దరి మధ్యా మాటల యుద్దం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అనూజ్ బెడ్ రూంలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. కాసేపటికే అతను ఉరేసుకుని చనిపోయాడు.