Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్రవరి 15వ తేదీ వరకు స్కూల్స్ మూసివేత.. ఎక్కడంటే..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజువారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్.. వంటి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు స్కూల్స్ మూసివేసి.. ఆన్‌లైన్ కాస్లులను కొనసాగిస్తున్నాయి.

schools to remain closed till February 15 in Uttar Pradesh to contain covid spread
Author
Lucknow, First Published Jan 27, 2022, 3:02 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజువారి కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్.. వంటి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు స్కూల్స్ మూసివేసి.. ఆన్‌లైన్ కాస్లులను కొనసాగిస్తున్నాయి. తాజాగా కరోనా ఉధృతి నేపత్యంలో స్కూల్స్‌ను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేయాలని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే జనవరి 30వ తేదీ వరకు రాష్ట్రంలో విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. 

అయితే పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో.. కోవిడ్ కట్టడిలో భాగంగా స్కూల్స్, ఇతర విద్యాసంస్థల మూసివేతను మరోమారును పొడిగిస్తూ యూపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తొలుత విద్యాసంస్థలను జనవరి 23 వరకు మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.. ఆ తర్వాత దానిని జనవరి 30 వరకు పొడిగించారు. ఇప్పుడు ఫిబ్రవరి 15 వరకు విద్యా సంస్థల మూసివేతను పొడగిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.  

అయితే విద్యాసంస్థలు మూసివేసినప్పటికీ.. ఆన్‌లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి అవ్నీష్ కుమార్ అవస్తీ తాజా నోటిఫికేషన్‌లో వివరాలు వెల్లడించారు. త్వరలో జరగనున్న సెకండరీ బోర్డు పరీక్షల దృష్ట్యా ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. 

ఇక, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఏడు దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ముగిశాక అంటే మార్చి 10 తర్వాత రాష్ట్రంలో 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ శిక్ష పరిషద్ (UPMSP) ఆలోచనలు చేస్తుంది. 

ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య కొంతమేర క్షీణించినప్పటికీ.. ఇప్పటికి రోజువారి కేసుల సంఖ్య 10వేలకు పైన ఉంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 10,937 కరోనా కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం యూపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య  80,342గా ఉంది. మరోవైపు రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతగా వేగవంతం చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios