మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.. స్కూల్ వ్యాన్‌ను బస్సు ఢీకొట్టడంతో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. సత్నా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌ ప్రాంతానికి విద్యార్థులతో వెళుతున్న బస్సు రీవా-చిత్రకూట్ రహదారిపై ప్రమాదానికి గురైంది.

స్కూల్ వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు సహా వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు.

వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారిస్తున్నారు.