Asianet News TeluguAsianet News Telugu

విమానం ల్యాండింగ్ లో సమస్య... గాలిలో 143మంది ప్రయాణికులు...

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లిన విమానం.. బుధవారం అర్థరాత్రి చెన్నై విమానాశ్రయానికి  చేరుకుంది. కాగా... మరి కొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా..  విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం చక్రం తెరచుకోలేదు. దీంతో... ఏం చేయాలో తోచని పైలెట్.. మరికాసేపు గాలిలోనే విమానాన్ని ఆకాశంలోకి తీసుకువెళ్లాడు.

scare passengers after flight wheel not opened in chennai
Author
Hyderabad, First Published Aug 9, 2019, 10:20 AM IST

విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో... మరి కొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం గంటలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఏం జరుగుతుందో తెలియక ఊపిరి బిగపట్టి మరీ కూర్చున్నారు. ఈ సంఘటన  చెన్నైలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లిన విమానం.. బుధవారం అర్థరాత్రి చెన్నై విమానాశ్రయానికి  చేరుకుంది. కాగా... మరి కొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా..  విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం చక్రం తెరచుకోలేదు. దీంతో... ఏం చేయాలో తోచని పైలెట్.. మరికాసేపు గాలిలోనే విమానాన్ని ఆకాశంలోకి తీసుకువెళ్లాడు.

ఆ తర్వాత విమానంలో తెలెత్తిన సమస్యను కంట్రోల్ రూమ్ కి తెలియజేశాడు. ఏం జరుగుతుందో తెలియక విమానంలోని 143మంది ప్రయాణికులు ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు.  కాగా.. ఎయిర్ పోర్టు అధికారులు అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్ లతో వైద్య సిబ్బందిని రన్ వే మీదకి చేర్చి ఎలాంటి ఎలాంటి ప్పరమాదం జరిగినా.. ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 

అరగంట తర్వాత పైలెట్ విమానాన్ని కిందకు తీసుకురాగా... రన్ వేపైకి రాగానే విమానం చక్రం తెరుచుకుంది. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో విమానంలోని ప్రయాణికులు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios