Asianet News TeluguAsianet News Telugu

పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించవద్దు: సుప్రీం కోర్టు 

గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానో తన పిటిషన్‌లో సామూహిక అత్యాచారం, హత్య కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని సవాలు చేశారు. అయితే.. ముందస్తు విచారణ కోసం బెంచ్ ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది.

SC refuses submissions seeking early listing of Bilkis Bano  plea
Author
First Published Dec 14, 2022, 1:55 PM IST

గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. తన పిటిషన్‌లో సామూహిక అత్యాచారం, హత్య కేసులో 11 మంది దోషుల శిక్షను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ సవాలు చేశారు.ఈ మేరకు పిటిషన్ ను త్వరగా విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే.. ముందస్తు విచారణ కోసం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ గుజరాత్ అల్లర్ల బాధితుడు బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.ఈ కేసును విచారించేందుకు మరో బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆమె న్యాయవాది శోభా గుప్తా పదే పదే కోరడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. 

బిల్కిస్ బానో తరపు న్యాయవాది శోభా గుప్తా .. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనాన్ని ఈ అంశాన్ని విచారించేందుకు కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సీజేఐ రిట్‌ను జాబితా చేస్తామని చెప్పారు. అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించవద్దనీ, ఆ విషయం చాలా కలవరపెడుతోందని సీజేఐ తెలిపారు. 


ఇదిలా ఉంటే.. బిల్కిస్ బానో కేసులో దోషుల్ని విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదీతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే ఈ విచారణ నుంచి మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీ అనూహ్యంగా తప్పుకున్నారు. వివరణ ప్రారంభానికి చివరి నిమిషంలో ముందు తాను తప్పుకుంటున్నట్టు జస్టిస్ త్రివేది ప్రకటించింది. అయితే.. తన  తిరస్కరణకు ఎటువంటి కారణం చెప్పలేదు. బిల్కిస్ బానో కేసును విచారించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో జస్టిస్ బేల ఎం త్రివేది భాగం కాదని పేర్కొన్నారు. 

బిల్కిస్ బానో కేసు 

బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం మినహాయింపునిచ్చి ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయడం గమనార్హం. గోద్రా అల్లర్ల తర్వాత బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. సంఘటన జరిగినప్పుడు బిల్కిస్ బానో ఐదు నెలల గర్భవతి. గుజరాత్ అల్లర్లలో ఆమె మూడేళ్ల కుమార్తె కూడా మరణించింది. బిల్కిస్ తన పిటిషన్‌లో, "ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడం... సమాజం యొక్క మనస్సాక్షిని కదిలించింది" అని పేర్కొంది. ఎన్‌మాస్‌ రిమిషన్‌ను అనుమతించలేమని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్నదని, ఉపశమనం పొడిగించే ముందు ప్రతి దోషి కేసును విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుందని ఆమె సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios