మైనర్ బాలికపై అత్యాచారం.. దోషికి శిక్ష తగ్గించిన సుప్రీం కోర్టు.. ఎందుకోసమంటే..

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి సుప్రీం కోర్టు శిక్షను తగ్గించింది. అయితే ఇందుకు.. బాధితురాలు తన వివాహ జీవితం సంతోషంగా ఉందని, ఈ విషయాన్ని కొనసాగించడానికి ఆసక్తి లేదని చెప్పడాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది.

SC reduces rape convict's sentence after victim says happily married

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి సుప్రీం కోర్టు శిక్షను తగ్గించింది. అయితే ఇందుకు.. బాధితురాలు తన వివాహ జీవితం సంతోషంగా ఉందని, ఈ విషయాన్ని కొనసాగించడానికి ఆసక్తి లేదని చెప్పడాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 ప్రకారం ఆ వ్యక్తిని దోషిగా కొనసాగిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఈ కేసు విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్‌లో 11 ఏళ్ల వయసు ఉన్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చగా.. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 1996 అక్టోబర్ 22న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు, అతని భార్య.. బాధితురాలికి అబార్షన్ చేయడానికి రూ. 10,000 ఆఫర్ చేశారు.

అయితే మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలోని ట్రయల్ కోర్టు ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో నిందితుడిని కోర్టు దోషిగా నిర్దారించింది. అతనికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 

‘‘ప్రతివాది ప్రాసిక్యూట్రిక్స్ (బాధితురాలి) సంరక్షకుడు. అతని భార్య ఆమెకు చదువు చెప్పించి, పెంచడానికి పూనుకుంది. బాధితురాలు పేదరికంలో ఉంది. అతని భార్య 11వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడే విద్య కోసం బాధితురాలికి ఆశ్రయం ఇచ్చింది. అయితే ప్రతివాది నిందితుడు బాధితురాలిని దోపిడీ చేశాడు’’ అని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే కనీస శిక్ష ఏడేళ్లు అయినప్పటికీ.. ఏడేళ్లలోపు జైలుశిక్ష విధించే విచక్షణాధికారం కోర్టుకే ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘‘ప్రాసిక్యూట్రిక్స్(బాధితురాలు) కూడా న్యాయవాది ద్వారా ఈ విషయంలో హాజరయ్యారు. తాను సంతోషంగా వివాహం చేసుకున్నానని, ఈ విషయాన్ని తదుపరి కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆమె పేర్కొంది. అప్పీలుదారు ఇప్పటికే ఐదేళ్లకు పైగా శిక్షను అనుభవించారు’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

అలాగే ప్రస్తుత కేసు యొక్క వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. “మేము భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 ప్రకారం నేరాన్ని కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ, న్యాయానికి సంబంధించిన ముగింపులను అమలు చేయడానికి ఇప్పటికే శిక్ష అనుభవించినంత సరిపోతుందని మేము కనుగొన్నాము’’ అని పేర్కొంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios