Asianet News TeluguAsianet News Telugu

హెయిర్‌ కట్ సరిగా చేయలేదని రూ.2 కోట్ల పరిహారం..  జాతీయ ఫోరం తీర్పును తోసిపుచ్చిన  సుప్రీంకోర్టు

హెయిర్‌ స్టైలింగ్‌లో లోపాలు ఉన్నందుకు ఓ మోడల్‌కు రూ.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. 

 

SC quashes Rs 2 crore compensation for haircut gone wrong
Author
First Published Feb 9, 2023, 5:45 AM IST

హెయిర్‌ కటింగ్ సరిగా చేయలేదని ఓ మోడల్‌కు రూ.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. సక్రమంగా హెయిర్‌ కటింగ్‌ చేయని కారణంగా.. సదరు మోడల్ తన ఆదాయాన్ని కోల్పోయానని, మానసిక క్షోభకు గురయ్యానంటూ ఫిర్యాదు చేసింది. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఫోరం రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని గతంలో ఆదేశించింది. దీంతో ఐటీసీ మౌర్యలోని సెలూన్ 'సేవలో లోపం'కి సంబంధించి కమీషన్ కనుగొన్న విషయాలలో జోక్యం చేసుకోకూడదని కోర్టు పేర్కొంది.

ఐటీసీ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఎన్‌సీడీఆర్‌సీ ఉత్తర్వును పక్కనపెట్టి, తాజాగా విచారణ చేపట్టాలని కోరింది. వాస్తవానికి, తన దావాకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించడానికి సదురు మోడల్ కు అవకాశం ఇచ్చింది. కానీ ఆమె అలా చేయడంలో విఫలమైంది. ఎన్‌సిడిఆర్‌సి ఆర్డర్‌ను పరిశీలిస్తే, పరిహారం పరిమాణాన్ని నిర్ణయించడానికి ఎటువంటి మెటీరియల్ సాక్ష్యాల గురించి మాకు ఎటువంటి చర్చ లేదా సూచన కనిపించడం లేదని బెంచ్ ఆర్డర్‌లో పేర్కొంది.

అసలు విషయం ఏమిటి?

2018 ఏప్రిల్‌ 12న ఢిల్లీలోని ఐటీసీ మౌర్య సెలూన్‌కు ఆష్నా రాయ్ అనే మోడల్ హెయిర్ కట్ కు వచ్చింది. హెయిర్ కటింగ్‌ ఉండాలనే దానిపై సూచనలు ఇచ్చారు. కానీ.. అక్కడ ఉన్న సిబ్బంది.. ఆ మోడల్ చెప్పిన సూచనలు పట్టించుకోకుండా.. హెయిర్‌ స్టయిలిస్ట్‌ మాత్రం కేవలం నాలుగు అంగుళాల పొడవున మాత్రమే జుట్టును ఉంచి మిగిలింది కత్తిరించారు. అది తనకు ఇబ్బందికరంగా మారిందని, మోడలింగ్‌ రంగంలో అవకాశాలు కోల్పోయానని ఆష్నా ఆరోపించారు.  ఆ తర్వాత విషయమై..ఆ మోడల్.. ఎన్‌సిడిఆర్‌సిని ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళలకు కేశాలే సంపద అని, మోడలింగ్‌ రంగంలో ఉన్నవారికి ఇది మరింత ముఖ్యమైనదని, సెప్టెంబర్ 2021లో బాధితురాలికి రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై ఐటీసీ మౌర్య యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.

నష్టాన్ని అంచనా వేయడానికి, ఆమె గత ఎండార్స్‌మెంట్ , మోడలింగ్ వర్క్ లేదా ప్రస్తుత, భవిష్యత్ ఒప్పందాలను ఆమె ఏదైనా బ్రాండ్‌తో చూపించాలని కోర్టు మోడల్ రాయ్‌ని కోరిందని బెంచ్ తెలిపింది. ఆమె వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, దానిని సమర్పించడానికి ఆమెకు అవకాశం ఇవ్వవచ్చని కోర్టు తెలిపింది. అలాగే ప్రతివాది రుజువు చేస్తే నష్టపరిహారానికి అర్హుడని చెప్పారు. ఈ పరిహారం ఏ ప్రాతిపదికన, ఎంత ఇవ్వాలి? NCDRC విచక్షణకే వదిలేయండని సుప్రీం కోర్టు పేర్కొంది. నొప్పి, బాధ, గాయం దృష్ట్యా పరిహారంగా రూ. 2 కోట్ల ఎన్‌సిడిఆర్‌సి ఆర్డర్‌ను పక్కన పెట్టడం మినహా మాకు వేరే మార్గం లేదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో రూ.2 కోట్ల పరిహారం మితిమీరిందని, అసమానమని, అన్యాయమని బెంచ్ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios