కేంద్ర ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం  నోటీసులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత పరూఖ్ అబ్దుల్లా ఆచూకీపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జమ్మూలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ముందు జాగ్రత్తలలో భాగంగా అక్కడి రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. 

కాగా..   తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడులో జరిగే కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాలని భావించారు. ఆయన వస్తారని అందరూ అనుకున్నారు. అయితే... ఆయన రాలేదు.  ఆయన ఆచూకీ కోసం ఎండీఎంకే అధినేత వైగో ప్రయత్నించగా లభించలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 

దీనిని ఈ రోజు విచారించిన జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఫరూక్ ఆచూకీపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, జమ్మూ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.