Asianet News TeluguAsianet News Telugu

శారిడాన్ కు సుప్రీంలో ఊరట

సుప్రీంకోర్టులో శారిడాన్ కు ఊరట లభించింది. డ్రగ్స్‌ నిషేధ జాబితా నుంచి శారిడాన్‌ తొలగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం గత వారం నిషేధించిన 328 డ్రగ్స్‌ జాబితా నుంచి శారిడాన్‌, డార్ట్‌, పిరిటాన్‌ ఎక్స్‌పెక్టోరాంట్‌ మూడు బ్రాండ్లను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. 

SC exempts Saridon, Piriton Expectorant from governments ban list
Author
Delhi, First Published Sep 17, 2018, 3:02 PM IST

ఢిల్లీ : సుప్రీంకోర్టులో శారిడాన్ కు ఊరట లభించింది. డ్రగ్స్‌ నిషేధ జాబితా నుంచి శారిడాన్‌ తొలగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం గత వారం నిషేధించిన 328 డ్రగ్స్‌ జాబితా నుంచి శారిడాన్‌, డార్ట్‌, పిరిటాన్‌ ఎక్స్‌పెక్టోరాంట్‌ మూడు బ్రాండ్లను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. 

శారిడాన్‌, డార్ట్‌, పిరిటాన్‌ ఎక్స్‌పెక్టోరాంట్‌లను మార్కెట్‌లో విక్రయించుకునేలా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రజల ఆరోగ్యానికి హాని కరంగా ఉన్నాయంటూ దాదాపు 328 డ్రగ్స్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  గతవారం నిషేధం విధించింది. 

సుప్రీంకోర్టు నిర్ణయం గ్లాక్సోస్మిత్‌ క్లైన్‌, పిరామల్‌ వంటి డ్రగ్స్‌ మేకర్స్‌కు భారీ ఊరట లభించినట్లైంది. ఈ ప్రొడక్ట్‌లు, ఆయా కంపెనీలకు పాపులర్‌ బ్రాండ్లు. 328 మెడిషిన్లపై నిషేధం విధిస్తూ, కేంద్రం జారీచేసిన నోటీసులపై ఈ కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జాబితా నుంచి తమ కాంబినేషన్స్‌ను మినహాయించాలని విన్నవించుకున్నాయి. 

1988 నుంచి ఈ కాంబినేషన్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామని కంపెనీలు ధర్మాసనానికి తెలిపాయి. గతంలో సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిషేధం నుంచి ఇలాంటి 15 కాంబినేషన్లను మినహాయించినట్టు గుర్తి చేశాయి. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు శారిడాన్, డార్ట్, పిరిటాన్ ఎక్స్ పెక్టోరాంట్ లను మినహాయిస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గ్లాక్సోస్మిత్‌క్లైన్ డ్రగ్స్ మేకర్స్ ధృవీకరించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios