SpiceJet: స్పైస్‌జెట్‌కు చెందిన అజయ్ సింగ్ , ఎయిర్‌లైన్ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ మధ్య దీర్ఘకాలంగా ఉన్న వాటా వివాదానికి శాశ్వత పరిష్కారానికి , స్పైస్‌జెట్ కొత్త సెటిల్‌మెంట్ ఆఫర్‌ను ముందుకు తీసుక‌వ‌చ్చింది. ఈ స‌మ‌స్య ప‌రిష్క‌రం కోసం స్పైస్‌జెట్ తన మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ మరియు అతని సంస్థ KAL ఎయిర్‌వేస్ కు రూ.600 కోట్ల నగదును చెల్లించడానికి ముందుకు వ‌చ్చిన‌ట్టు 

తెలిపింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించాల‌ని కళానిధి మారన్‌, అతని సంస్థ KAL ఎయిర్‌వేస్‌ను సుప్రీంకోర్టు గురువారం కోరింది. సుధీర్ఘ కాలంగా వివాదంలో ఉన్న‌ వాటా బదిలీ కేసు నేడు సుప్రీం కోర్టులో విచార‌ణకు వ‌చ్చింది.

స్పైస్‌జెట్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గ మాట్లాడుతూ.. స్పైస్‌జెట్ ఇప్పటికే రూ. 308 కోట్ల నగదును చెల్లించిందని, 270 కోట్లకు సమానమైన బ్యాంక్ గ్యారెంటీని నగదు రూపంలో సమర్పించిందని, అదనంగా రూ. 22 కోట్లతో టాప్-అప్ చేయాలని ప్రతిపాదించారని, మొత్తం చెల్లింపు మొత్తం రూ.600 కోట్లకు చేరుకుందని ప్రతినిధి పేర్కొన్నారు. స్పైస్‌జెట్ అభ్యర్థనను పరిశీలించమని కోర్టు అవతలి పక్షాన్ని ఆదేశించింది. తద్వారా పార్టీల మధ్య ఉన్న అన్ని వివాదాల పూర్తి స్థాయిలో పరిష్కారమ‌వుతాయ‌ని, మారన్ ఆఫర్ను అంగీకరించకపోతే, బ్యాంక్ గ్యారెంటీ కింద పొందబడిన తగ్గిన మొత్తాన్ని అతనికి పంపిణీ చేయాలని న్యాయవాది ప్రతిపాదించారు. ఈ కేసు విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి14, 2022కి షెడ్యూల్ చేసింది సుప్రీంకోర్టు.

స్పైస్‌జెట్‌లోని తన 58.46 శాతం వాటాను (లేదా) 50.4 మిలియన్ల షేర్లను మారన్ సింగ్‌కు నామమాత్రపు రూ. 2కు విక్రయించడంతో 2015లో వివాదం మొదలైంది. 2016లో సింగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ మారన్ కోర్టును ఆశ్రయించారు, తనకు రూ. 679 కోట్ల ఇన్ఫ్యూషన్ ఉన్నప్పటికీ 189 మిలియన్ షేర్ వారెంట్లు జారీ చేయలేదు. దీని కారణంగా స్పైస్‌జెట్, సింగ్ నుండి 1,300 కోట్ల రూపాయలు అతను క్లెయిమ్ చేశాడు. జూలై 2016లో హైకోర్టు మారన్, సింగ్‌లను మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది.

అంతకుముందు సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులు, అరిజిత్ పసాయత్, హేమంత్ లక్ష్మణ్ గోఖలే మరియు KSP రాధాకృష్ణన్‌లతో కూడిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ స్పైస్‌జెట్‌పై కళానిధి మారన్, కాల్ ఎయిర్‌వేస్ నష్టపరిహారం దావాను ఏకగ్రీవ నిర్ణయంతో తిరస్కరించింది.