ఉచిత పెట్రోల్‌ ఆఫర్‌ను ఎస్బీఐ మరికొన్ని రోజులు పొడిగించింది. తమ ఖాతాదారులకు 5 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా అందించనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.  

న్యూఢిల్లీ: ఉచిత పెట్రోల్‌ ఆఫర్‌ను ఎస్బీఐ మరికొన్ని రోజులు పొడిగించింది. తమ ఖాతాదారులకు 5 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా అందించనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఆఫర్‌ను డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్టు ఎస్బీఐ తెలిపింది.

ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్టర్‌లో ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఎస్బీఐ కార్డు లేదా భీమ్ ఎస్బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్ల ద్వారా పెట్రోల్‌ కొంటే 5 లీటర్ల వరకు పెట్రోల్‌ను ఉచితంగా పొందవచ్చని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆఫర్ ఈ ఏడాది నవంబర్ 23తో ముగిసింది.కానీ, ఈ ఆఫర్ ను మరో 15 రోజుల వరకు అంటే డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది.

ఇండియన్‌ ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్‌ బంకులోనైనా కనీసం 100 రూపాయల విలువైన పెట్రోలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదీ భీమ్‌, ఎస్‌బీఐకార్డు ద్వారా డబ్బులు చెల్లించాల్సిందే.

12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెలఅధికార కోడ్‌ను 9222222084కు ఎస్ఎంఎస్ చేయాలని ఎస్బీఐ ప్రకటించింది. ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను పంపవచ్చని ఎస్బీఐ ప్రకటించింది అయితే ప‍్రతీ ఎస్‌ఎంఎస్‌కు డిఫరెంట్‌ కోడ్‌ ఉండాలని కండిషన్ పెట్టింది.

 భీమ్‌ ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్‌ , ఎస్‌బీఐ కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో 6అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి వుటుంది.

అంతేకాదు ఇలా అందిన ఎస్‌ఎంఎస్‌లలో ఎంపికచేసిన దానికి 50 ,100 ,150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ప్రచార కాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండు సార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం. ఆఫర్‌ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు.