Asianet News TeluguAsianet News Telugu

ఒక‌టి కాదు.. రెండు కాదు.. 43 ఏండ్ల‌ల్లో 53 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు

సౌదీ అరేబియాకు  చెందిన ఓ వ్యక్తి ..  ఒక్క‌టి కాదు.. రెండు కాదు.. త‌న 43 సంవత్సరాలలో 53  పెళ్లి చేసుకున్నాడు. 'శతాబ్దపు బహుభార్యాత్వవేత్త గా పేరు పొందాడు. తనను సంతోషపెట్టగల స్త్రీ కోసం ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాన‌ని అంటున్నాడు. 

Saudi man marries 53 times in 43 years. He says this is the reason
Author
First Published Sep 17, 2022, 1:30 AM IST

జీవితంలో ఒక్క‌సారి పెళ్లి చేసుకోవడానికే  నానా తంటాలు ప‌డుతుంటే..  సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఒక‌టి కాదు, రెండు కాదు.. నిత్య పెళ్లి కొడుకులా.. ఏకంగా  53 పెళ్లిళ్లు చేసుకున్నాడు.  ఆ నిత్య పెళ్లికొడుకు 43 ఏండ్ల‌లో 53 సార్లు వేర్వేరు అమ్మాయిల‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ శతాబ్ధపు బహు భార్యత్వవేత్త’ అనే బిరుదు పొందాడు. ఇన్ని పెళ్లిళ్లు చేసుకుంది.. త‌న వ్యక్తిగత ఆనందం కోసం కాద‌నీ,  వివాహబంధంలో స్థిరత్వం కోసం..  ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నానని చెబుతున్నాడు. 

వివరాల్లోకెళ్తే.. సౌదీ అరేబియాకు చెందిన 63 ఏళ్ల‌ అబూ అబ్దుల్లా.. తన ఫ‌స్ట్ మ్యారేజ్ కేవ‌లం 20 ఏళ్ల వయసులోనే జ‌రిగింద‌నీ, త‌న మొదటి భార్య త‌న కంటే..  ఆరేండ్లు  పెద్దది. త‌న సంసారం మొద‌టి మూడేండ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా.. చాలా సంతోషంగా గ‌డిచింద‌నీ, భార్య, పిల్లలతో సుఖంగా ఉండటంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని చెప్పాడు. కానీ, కాలక్ర‌మేణా.. త‌న మొద‌టి భార్య‌తో సమస్యలు రావడంతో మళ్లీ వివాహం చేసుకున్నానని.. ఈ విషయాన్ని డైరెక్ట్ గా  తన భార్యకు కూడా తెలియజేశానని తెలిపారు. అందుకు ఆమెకు ఓకే తెలిపింది. దీంతో త‌న 23 ఏటా రెండో పెళ్లి  చేసుకున్నాడు. అయితే.. మొద‌టి భార్య‌కు, రెండో భార్యకు మ‌ధ్య గొడవలు రావడంతో మూడో పెళ్లి.. ఆ తరువాత నాలుగో పెళ్లి  చేసుకున్నానని తెలిపాడు. ఈ క్ర‌మంలో త‌న మొద‌టి ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి మ‌రో వివాహం చేసుకున్నానని తెలిపాడు. తాను పెళ్ళి చేసుకున్న వారిలో చాలా మంది సౌదీకే చెందిన అమ్మాయిలేన‌ని తెలిపారు.  విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి మహిళలను కూడా పెళ్లిళ్లు  చేసుకున్నాడ‌ట‌. 

ప్ర‌తి ఏడాది  మూడు నుండి నాలుగు నెలల పాటు తాను విదేశీ ప‌ర్య‌ట‌నలు చేసేవాడిన‌నీ,, ఆ స‌మ‌యంలో త‌న బాగోగులు చూసుకునే వారు అవ‌స‌ర‌ముండేద‌నీ, ఈ క్ర‌మంలో ప‌లువురు విదేశీ యువ‌తుల‌ను పెళ్లి  చేసుకున్న‌ట్టు అబ్దుల్లా చెప్పారు. ఇక‌పై  మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios