పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జంప్ జిలానీలు ఎక్కువవుతున్నారు. శనివారం తాను ఢిల్లీ వెడతానని నిన్న ప్రకటించిన టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు.

శనివారం తాను ఢిల్లీ వెళ్లడం లేదని ఆమె శుక్రవారం రాత్రి మీడియాతో ప్రకటించారు. తృణమూల్‌లోనే ఉన్నానని, ఇకపై తృణమూల్‌తోనే ఉంటానని ఆమె ప్రకటించారు. తాను ఎంపీ అభిషేక్ బెనర్జీతో పూర్తిగా చర్చించానని, తన వాదనలను ఆయన సావధానంగా ఆలకించారని ఆమె వెల్లడించారు. ‘‘శనివారం నేను ఢిల్లీ వెళ్లడం లేదు. టీఎంసీలోనే ఉంటాను.’’ అని ఆమె ప్రకటించారు.
పార్టీలో అసంతృప్తి ఉన్నవారందరూ తమ సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని, పది మంది ఒక్కసారిగా సమస్యలను లేవనెత్తినా పార్టీ వాటిని పరిష్కరించాలి అని శతాబ్ది రాయ్ అన్నారు.
శనివారం తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతానని అంతకు పూర్వం ఆమె ప్రకటించారు. ఓ ఎంపీగా తాను ఎవరితోనైనా భేటీ కావొచ్చని, అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని ఆమె తెలిపారు.
పార్టీ కార్యక్రమాలకు తాను తరచూ దూరంగా ఉండటానికి కారణం పార్టీ నేతలే అని విమర్శించారు. తాను పార్టీలో ఉండాలని సొంత పార్టీ నేతలే కోరుకోవడం లేదని శతాబ్ది రాయ్ సంచలన ప్రకటనలు చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 16, 2021, 9:26 AM IST