చెన్నై: అన్నాడిఎంకె నుండి బహిష్కరణకు గురైన శశికళ ఓటు గల్లంతైంది. ఓటరు జాబితాలో ఆమె పేరు లేకుండాపోయింది. దీంతో ఆమె రేపు జరిగే పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కోల్పోయింది.

పోయేస్ గార్డెన్ చిరునామాలోని శశికళతో పాటు మరో 19 మంది పేర్లు ఓటర్ల జాబితాలో లేవు.జె. ఇలవరసితో పాటు 19 మంది పేర్లు గల్లంతయ్యాయి. పోయేస్ గార్డెన్ థౌజండ్స్ లైట్స్ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది.పోయేస్ గార్డెన్ నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చే ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఓటర్ల జాబితా నుండి ఈ పేర్లు తొలగించినట్టుగా చెబుతున్నారు. 

ఓటర్ల జాబితా నుండి శశికళ పేరును ఎలా తొలగిస్తారని ఎఎంఎంకె అభ్యర్ధి వైద్యనాథన్ ప్రశ్నించారు.శశికళ జైలు నుండి విడుదలైన వెంటనే శశికళ న్యాయవాది రాజా సెంతురు పాండియన్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించినప్పటికీ  ఈ విషయమై ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు లేదా తొలగింపు ప్రక్రియను పూర్తి చేసింది.

సీఎం పళనిస్వామి సలహా మేరకు ఓటరు జాబితా నుండి శశికళ పేరును తొలగించారని వైద్యనాథన్ ఆరోపించారు.