పాకిస్తాన్ జైలులో మరణించిన సరబ్జిత్ సింగ్ భార్య సుఖ్‌ప్రీత్ సింగ్ ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో దుర్మరణం చెందారు. సరబ్జిత్ సింగ్ 2013లో మరణించాడు. ఆయన విడుదల కోసం అన్ని చోట్లా గళమెత్తిన సరబ్జిత్ సింగ్ భార్య దల్బీర్ కౌర్ ఈ ఏడాది జూన్‌లో మరణించారు.  

న్యూఢిల్లీ: సరబ్జిత్ సింగ్ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. సరబ్జిత్ సింగ్ విడుదల కోసం ఆయన సోదరి దల్బీర్ కౌర్ పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. కానీ, 2013లో సరబ్జిత్ సింగ్ జైలులో తోటి ఖైదీలతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు వదిలాడు. ఆయన కోసం పోరాడుతూనే జీవితాన్ని గడిపిన సోదరి జూన్ నెలలో మరణించారు. ఇప్పుడు సరబ్జిత్ సింగ్ భార్య సుఖ్‌ప్రీత్ కౌర్ ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో దుర్మరణం చెందారు.

సుఖ్‌ప్రీత్ సింగ్ ద్విచక్ర వాహనంపై వెనుకాల కూర్చుని ఉన్నారు. ఆ వాహనం ఫతేపూర్ సమీపంలో కిందపడిందని పోలీసులు తెలిపారు. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారని వివరించారు. ఆమె అంత్యక్రియలు వారి నేటివ్ ప్లేస్ అయినా పంజాబ్‌లోని తర్న్ తారణ్‌లో బిఖివిండ్‌లో రేపు జరుగుతాయని చెప్పారు. సుఖ్‌ప్రీత్ సింగ్ ఇద్దరు కూతుళ్లు పూనమ్, స్వపన్‌దీప్ కౌర్‌లను పెంచుతూ ఇన్నాళ్లు జీవించింది.

సరబ్జిత్ సింగ్ విడుదల కోసం ఎన్నో వేదికలపై తన గొంతు ఎత్తిన ఆయన సోదరి దల్బిర్ కౌర్ జూన్‌లో కన్నమూశారు. చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత ఆమె ప్రాణాలే వదిలారు. 

లాహోర్ జైలులో ఖైదీలకు మధ్య తీవ్ర గొడవలు జరిగాయి. ఇలాంటి ఓ గొడవ 2013 ఏప్రిల్‌లో జరిగింది. ఈ గొడవలోనే తీవ్రంగా గాయపడిన సరబ్జిత్ సింగ్ తుది శ్వాస విడిచారు. 

పాకిస్తాన్ పై గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో పాకిస్తాన్ కోర్టు ఆయనకు 1991లో మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను ప్రభుత్వం స్టే ఇచ్చింది. కానీ, ఆమె జైలులోనే మరణించాడు. ఆయన డెడ్ బాడీకి అంత్యక్రియల కోసం లాహోర్ నుంచి అమృత్‌సర్‌కు పంపించారు.