ఆడపిల్లలను నెలసరి సమస్య వేధిస్తూనే ఉంటుంది. మన దేశంలో కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా లభించక అవస్థలు పడేవారు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన కామెంట్స్.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన తాజాగా చేసిన కామెంట్స్ పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఇంతకీ మ్యాటరేంటంటే.. నేడు భారతదేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.దేశ రాజధాని ఢిల్లీలో  ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

కాగా.. ఈ క్రమంలో... ఆయన మహిళా సాధికారత గురించి వివరించారు.  తమ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం గురించి నిరంతరం ఆందోళన చెందుతుందని ఆయన అన్నారు. 6వేల జనషౌదీ కేంద్రాల ద్వారా దేశంలోని 5కోట్ల మంది మహిళలకు కేవలం ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్స్ అందజేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మహిళల వివాహాల కోసం.. డబ్బు ను సరైన సమయంలో ఉపయోగించుకునేలా తాము కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కాగా.. ఎర్రకోట దగ్గర నిలబడి.. మహిళల రుతుక్రమ సమస్యలు, శానిటరీ ప్యాడ్స్ గురించి ప్రధాని మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహిళలు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘ మేము నెలసరి సమయంలో ఇబ్బంది పడుతున్నా.. కనీసం దుకాణానికి వెళ్లి ప్యాడ్స్ తేవడానికి కూడా మా ఇంట్లో ఏ ఒక్క మగాడు ఇష్టపడడు. కానీ.. అతి తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ అందజేస్తామంటూ ప్రధాని ప్రకటించారని.. ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తే తమకు కావాలంటూ ఓ మహిళ పేర్కొనడం గమనార్హం.

ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు.. మహిళల విజయం గురించి మాట్లాడటం.. శానిటరీ ప్యాడ్స్ గురించి చర్చించడం లాంటివి చేయగలరా..? కనీసం ఊహించగలరా  అంటూ మరో మహిళ ప్రశ్నించారు.

ఇలాంటి కామెంట్స్ కోకొల్లలు. ప్రస్తుతం ట్విట్టర్ లో టాపిక్ ట్రెండింగ్ అవ్వడం గమనార్హం. మొత్తానికి ప్రధాని మోదీని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు.