Asianet News TeluguAsianet News Telugu

పార్టీ కార్యకర్తను పెళ్లి చేసుకున్న ఆప్ మహిళా ఎమ్మెల్యే...

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే తమ పార్టీ కార్యకర్తనే పెళ్లి చేసుకున్నారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Sangrur MLA Narinder Kaur Bharaj married AAP worker In punjab
Author
First Published Oct 8, 2022, 9:58 AM IST

పంజాబ్ : పంజాబ్ కు చెందిన ఆప్  శాసన సభ్యురాలు నరేందర్ కౌర్ భరాజ్(28) ఆ పార్టీ కార్యకర్త మణ్ దీప్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. పటియాలాలో రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో శుక్రవారం జరిగిన వీరి వివాహానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరయ్యారు. సంగ్రూర్ లోని భరాజ్ గ్రామంలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన నరేందర్ గౌడ్ పాఠశాలలోని పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చదివారు. 

2014 లోక్సభ ఎన్నికల సమయంలో తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. భగవంత్ మాన్ ప్రోత్సాహంతో రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో సంగ్రూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. నరీందర్ కౌర్..  పంజాబ్ లో అతి చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. మణ్ దీప్ సింగ్ గతంలో సంగ్రూర్ జిల్లా ఆప్  మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేశారు.

ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై తమిళనాడు నిషేధం.. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం.. ఇక చట్టాన్ని ఉల్లంఘిస్తే అంతే..

ఇదిలా ఉండగా,  పంజాబ్లో సెప్టెంబర్ 2న ఓ మహిళా ఎమ్మెల్యేపై జరిగిన దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి భర్త నుంచి అందరిముందు వేధింపులు ఎదురయ్యాయి. అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే బల్విందర్ కౌర్ పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. పంజాబ్ లోని తన నివాసంలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని తాల్వండి సాబో నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్.. ఆమె భర్త సుఖ్ రాజ్ సింగ్ మధ్య ఏదో కారణంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన సుఖ్ రాజ్ సింగ్ అందరూ చూస్తుండగానే బల్జిందర్ పై చేయి చేసుకున్నారు. 

ఈ క్రమంలో వెంటనే పక్కనే ఉన్నవారు అడ్డుకుని ఆయనను అక్కడినుంచి లోపలికి తీసుకువెళ్లారు. జులై 10న ఈ ఘటన చోటు చేసుకోగా… ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిందర్ ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. ఆమెపై చేయి చేసుకోవడం దిగ్భ్రాంతికరమని, ఇకనైనా పురుషుల ఆలోచనా ధోరణి మారాలని ఆకాంక్షించారు.ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాసమస్యలు లేవనెత్తే మహిళలు ఇంట్లోనే వేధింపులు ఎదుర్కోవడం దారుణమని పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

అయితే దీనిపై బల్జిందర్ కౌర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  పోలీసులకు కూడా ఆమె నుంచి ఎలాంటి ఫిర్యాదు ఎవరు రాలేదని సమాచారం. పంజాబ్ లోని మఝూ ప్రాంతంలో ఆప్ యూత్ విభాగ కన్వీనర్ అయిన సుఖ్ రాజ్ తో బల్జిందర్ కు 2019  ఫిబ్రవరిలో వివాహమైంది. పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన కౌర్ రాజకీయాల్లోకి రాకముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేశారు. తాల్వండి సాబో నుంచి వరుసగా రెండుసార్లు  ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios