చెన్నై: సినీ నటి అయిన తన భార్య సంధ్యను హత్య చేసిన కేసులో దర్శుకుడు బాలకృష్ణన్ ను పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. సంధ్య శవాన్ని ముక్కలుగా నరికి నగరంలోని డంప్ యార్డులో పడేశాడు. అయితే, తల లేకుండా శరీర భాగాలు మాత్రమే పోలీసులకు లభ్యమయ్యాయి. 

గత నెలలో ఆ సంఘటన జరిగింది. అయితే, బాలకృష్ణన్ తాను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో కీలకమైన ఆధారాన్ని వదిలిపెట్టిన విషయాన్ని గుర్తించలేదు. ఆ క్లూతోనే పోలీసులు కేసును ఛేదించారు. 

కాళ్లపై వేయించుకున్న పచ్చబొట్లతో ఆమెను 37 ఏళ్ల సంధ్యగా పోలీసులు గుర్తించారు.  శివ - పార్వతి, డ్రాగన్ రూపాల్లోని క్లూలు కేసును ఛేదించడానికి పోలీసులకు పనికి వచ్చాయి. అంతేకాకుండా గాజులు కూడా దర్యాప్తులో సాయపడ్డాయి. 

సంధ్యను బాలకృష్ణన్ గత నెల 19వ తేదీన హత్య చేసి, మర్నాడు శవాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో ముక్కలను పెట్టి నగరంలోని పలు చోట్ల చెత్తకుండీల్లో వేశాడు.

పచ్చబొట్లు, గాజులను పోలీసులు సర్క్యులేట్ చేశారు. దాంతో తూతుకుడిలోని సంధ్య తల్లి హత్యకు గురైంది సంధ్యే అనే విషయాన్ని గుర్తించింది. అయితే, సంధ్య తుత్తుకుడి వెళ్లిందని, ఫోన్ చేస్తే ఎత్తడం లేదని బాలకృష్ణన్ చెబుతూ వచ్చాడు. 

కనిపించకుండా పోయిన తల భాగం కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంధ్యను చంపినట్లు బాలకృష్ణన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. 

సంబంధిత వార్త

సినీనటి సంధ్య దారుణహత్య: చంపి ముక్కలుగా కోసిన భర్త