భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్ పట్టణంలో స్వలింగ సంపర్కులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య తర్వాత వీరిద్దరూ కూడ పురుషులేనని తేలింది.

సెహోర్ పట్టణంలో పెళ్లి చేసుకొన్న ఇద్దరు 8 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. 2012లో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి చేసుకొన్న రెండేళ్ల తర్వాత వీరు ఒక పిల్లాడిని దత్తత తీసుకొని పెంచుకొంటున్నారు.

ఈ ఏడాది ఆగష్టు 11వ తేదీన భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవతో ఆవేశంలో భార్య కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను కాపాడే ప్రయత్నం భర్తకు కూడ మంటలు వ్యాపించాయి. ఇద్దరు కూడ తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు వారిని భోపాల్ ఆసుపత్రిలో ఆగష్టు 12వ తేదీన చేర్పించారు. అదే రోజున  భార్య మరణించింది. ఆగష్టు 16వ తేదీన భర్త మరణించాడు. 

ఈ రెండు మృతదేహాల ఆటాప్సీని రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ రిపోర్టు ప్రకారంగా చనిపోయింది ఇద్దరు పురుషులేనని వైద్యులు తేల్చి చెప్పారు. 

ఆటాప్సీ రిపోర్టు ప్రకారంగా భర్త కుటుంబసభ్యుల నుండి పోలీసులు ఆరా తీశారు. తన సోదరుడు  ఎల్జీబీటీ ఉద్యమానికి మద్దతిచ్చేవాడని చెప్పారు. ఈ సమయంలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందన్నారు. గే ను పెళ్లి చేసుకోవాలని తన సోదరుడు తమతో చెబితే తాము తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

పెళ్లికి వద్దని చెప్పడంతో  ఇంటి నుండి వెళ్లిపోయినట్టుగా ఆయన చెప్పారు. 8 ఏళ్లుగా అతను ఎక్కడ ఉన్నాడో కూడ తమకు తెలియదన్నారు.

సెహోర్ పట్టణంలో వీరిద్దరూ కూడ భార్యభర్తలుగా జీవనం సాగిస్తూ స్థానికులను నమ్మించారు.  ఒక్కరికి కూడ అనుమానం కలగలేదని ఇరుగుపొరుగు వారు కూడ అనుమానం కలగకుండా జాగ్రత్తపడ్డారు.