రాయ్‌పూర్: ఐదేళ్లుగా ప్రేమించుకొన్న ఇద్దరు అమ్మాయిలు ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకొన్నారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలోని కొదెర్మ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకొన్నారు.  ఈ విషయం పెద్దలకు తెలిస్తే ఒప్పుకోరని భావించి  ఇంటి నుండి పారిపోయారు.  ఈ ఏడాది నవంబర్ 8వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు.

తమ ఇంటికి సమీపంలోని గుడిలోనే పెళ్లి చేసుకొని  వేరే చోట ఇల్లు తీసుకొని కాపురం కూడ పెట్టారు. ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకొంటున్నారు. చంద్రచౌక్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం మొదలుపెట్టారు.

వీరిద్దరూ కాపురం ఉంటున్న  ప్రాంతాన్ని తెలుసుకొన్న ఇరు కుటుంబాల సభ్యులు అక్కడికి చేరుకొని వారిద్దరిని తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఇద్దరితో గొడవకు దిగారు.  పెళ్లి చేసుకొన్న ఇద్దరు అమ్మాయిలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు కూడా మేజర్లు కావడంతో రెండు కుటుంబాల సభ్యులకు పోలీసులు నచ్చజెప్పి పంపారు.తమ పెళ్లిని చట్టబద్దం చేసుకొంటామని అమ్మాయిలు చెప్పారు.