‘ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశా. అలాంటిది నన్ను కాదని వేరే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటి మీద పోసుకున్న పెట్రోల్ కళ్లలోకి పడటంతో ఠాకూర్ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

లక్నో : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ Uttar Pradesh రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడి పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. మరికొందరు తీవ్ర ఆగ్రహానికి గురై స్నేహితులు, సన్నిహితుల వద్ద బోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే Samajwadi Partyకి చెందిన Aditya Thakur అనే నేత ఏకంగా suicide attemptకు యత్నించారు. 

లక్నో లోని పార్టీ కార్యాలయం ముందే ఒంటిమీద petrol పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే ఆయనను అడ్డుకున్నారు. Party membership కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకన్నానని ఠాకూర్ బోరున విలపించారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానని తెలిపారు.

‘ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశా. అలాంటిది నన్ను కాదని వేరే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటి మీద పోసుకున్న పెట్రోల్ కళ్లలోకి పడటంతో ఠాకూర్ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

ఉత్తరప్రదేశ్ లో తొలిదశ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 125 మందితో తొలి జాబితా ప్రకటించింది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు సైతం పలువురు అభ్యర్థులను ఖరారు చేశాయి. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా మారనున్నాయి. అధికార పార్టీ బీజేపీ కంటే రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీ పొత్తులు, ఎత్తులతో కాస్త ముందుంది. ప్రాంతీయ పార్టీలతో సమాజ్‌వాదీ పార్టీ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు పార్టీల నాయకులు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీనికోసం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో కూడా పొత్తుల గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే, చంద్రశేఖర్ ఆజాద్ 10 సీట్లు అడగగా.. అఖిలేష్ మూడు సీట్లే ఆఫర్ చేసినట్లు భీమ్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఇదే విష‌యం గురించి మీడియాకు వెల్ల‌డించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్.. ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌మాజ్ వాదీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. "అఖిలేష్ జీకి ఈ కూటమిలో దళిత నాయకులు వద్దు... దళితుల ఓట్లు మాత్రమే కావాలి. దళితులు ఆయనకు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం మాట్లాడలేమని నా భయం. మా సమస్యల గురించి అతనికి చెప్పండి... మమ్మల్ని కొట్టినా, మా భూములు దోచుకున్నా, మా మహిళలపై అత్యాచారం చేసినా స్పందించ‌రు" అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు భీం ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌. 

ఎన్నిక‌ల్లో పోటీ చేసే పోత్తుల విష‌యంలో అఖిలేష్ యాద‌వ్ తమని మోసం చేశారని పేర్కొన్నారు. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రంలో త్వరలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటయ్యే అవకాశం కూడా ఉంద‌ని ఆజాద్ తెలిపారు.