లక్నో: సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గల పిజీఐ ఆస్పత్రిలో చేరారు.

వైద్యులు ములాయం సింగ్ యాదవ్ కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్ది గంటల్లో ఆయనను డిశ్చార్జీ చేస్తామని పిజిఐ వైద్యులు చెప్పారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ ఆయనకు తలెత్తలేదని వారు చెప్పారు. 

సాధారణమైన కొన్ని సమస్యలతో మాత్రమే ఆయన ఆస్పత్రికి వచ్చారని అన్నారు.