Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు తుపాకీ లైసెన్స్ జారీ చేశారు. పంజాబ్ సింగర్ మూసేవాలా హత్యాంనతరం ఆయనకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు గన్ లైసెన్స్ జారీ చేయబడింది. గత రెండు నెల క్రితం.. పంజాబీ గాయకుడు, రాపర్ సిద్ధు ముసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంచలన హత్యనంతరం..బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్‌ను కూడా చంపుతామని బెదిరింపు లేఖ రాశారు. సిద్దూ మూసేవాలా దారుణ హత్య నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.
ఈ క్రమంలో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌ను కలిసి ఆయుధాలు ఉంచుకోవడానికి లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత అతని దరఖాస్తు ఆమోదించబడింది. సల్మాన్ ఇప్పుడు తన భద్రత కోసం ఆయుధాలను ఉంచుకోవచ్చు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సల్మాన్ బృందం తరపున కమీషనర్ కార్యాలయం నుండి ఆర్మ్ లైసెన్స్ సేకరించబడింది. బెదిరింపు లేఖ వచ్చిన తర్వాత.. సల్మాన్ ఖాన్ భద్రతను కూడా పెంచారు, నటుడు భద్రతకు ప్రమాదం ఉందనీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో జూలై 22న సల్మాన్ తన వద్ద వ్యక్తిగత తుపాకీని ఉంచుకోవడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన వినతిని పోలీసులు ఆమోదించారు. ఇది కాకుండా, సల్మాన్ ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది.
బుల్లెట్ ప్రూఫ్ కారులో సల్మాన్ డ్రైవ్
సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం ఖాన్‌కు వచ్చిన బెదిరింపు లేఖలో.. పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలాకు కూడా అదే గతి పడుతుందని పేర్కొనబడింది. ముసేవాలాను మే 29న పట్టపగలు కొందరు ముష్కరులు కాల్చి చంపారు. ఈ కేసులో నిందితుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ 2018 నుండి నటుడిని చంపడానికి కుట్ర పన్నుతున్నట్లు వెల్లడించాడు. ఈ బెదిరింపుల తరువాత.. సల్మాన్ భద్రత కోసం, అతని కారు ల్యాండ్ క్రూయిజర్‌ను అప్‌గ్రేడ్ చేసి, వాహనాన్ని బుల్లెట్‌ప్రూఫ్‌గా మార్చినట్లు చెబుతున్నారు.
సల్మాన్‌కు తుపాకీ లైసెన్స్ జారీ
ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి ఆదివారం ధృవీకరించారు. సల్మాన్ ఖాన్ కొన్ని రోజుల క్రితం తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో జూలై 22 న ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సల్కర్‌ను కూడా కలిశాడు. అజ్ఞాత షరతుపై.. సల్మాన్ ఖాన్ ప్రతినిధి పోలీసు ప్రధాన కార్యాలయానికి సంబంధించిన శాఖ నుండి లైసెన్స్ పొందారని IPS అధికారి తెలిపారు. ఆ వ్యక్తి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకున్న తర్వాత అతనికి లైసెన్స్‌ను అందజేశారు. నేర చరిత్రను చూసిన తర్వాత లైసెన్స్ మంజూరు చేయబడిందనీ, అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాతే నటుడికి ఆయుధ లైసెన్స్‌ని జారీ చేశామని అని అధికారి చెప్పారు.
సల్మాన్‌కు బెదిరింపులు
సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు రావడంతో అతని భద్రతను జూన్ 6 వరకు పొడిగించారు. ఉదయం బెంచ్‌పై మార్నింగ్ వాక్ చేస్తుండగా.. సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్‌ను చంపేస్తానని బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖ అందుకున్న తర్వాత, సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. అతని ఇంటి వెలుపల పోలీసు వ్యాన్ కూడా మోహరించారు. పంజాబీ గాయకుడు, రాపర్ సిద్ధు మూసేవాలా మే 29న పంజాబ్‌లోని మాన్సాలో పట్టపగలు కాల్చి చంపబడ్డాడు. ఆ తర్వాత అతను అక్కడే మరణించాడు. చనిపోయిన కొద్ది రోజులకే బాలీవుడ్ సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ కు ఈ బెదిరింపు లేఖ వచ్చింది. అందులో సిద్దూ తరహాలో హత్య చేస్తామని బెదిరించారు.
