Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ ఉద్యోగులు కూడా మరణిస్తారు వాళ్లు అమరులా: సైన్యంపై రచయిత్రి వ్యాఖ్యలు

దేశరక్షణలో భాగంగా తమ జీవితాలను తృణప్రాయంగా భావించి ప్రాణాలు కోల్పోయారు ఎందరో అమర జవానులు. దేశానికి స్వాతంత్య్ర సముపార్జనకు సమరయోధులు ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించారో, ఆ తర్వాత భారత సైన్యం కూడా అదేస్థాయి పాత్ర పోషించింది. 

salaried soldiers cannot be called martyrs women writers arrest ksp
Author
Assam, First Published Apr 7, 2021, 5:24 PM IST

దేశరక్షణలో భాగంగా తమ జీవితాలను తృణప్రాయంగా భావించి ప్రాణాలు కోల్పోయారు ఎందరో అమర జవానులు. దేశానికి స్వాతంత్య్ర సముపార్జనకు సమరయోధులు ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించారో, ఆ తర్వాత భారత సైన్యం కూడా అదేస్థాయి పాత్ర పోషించింది.

స్వతంత్ర భారతదేశానికి ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా, చాకచక్యంగా సైన్యం ఎదుర్కొంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సవాల్‌ విసిరినప్పుడు సైనికులు అసమాన ధైర్యసాహసాలతో పోరాడారు.

అలాంటి వీరుల త్యాగాలకు ఎంత చేసినా తక్కువే. వారికి మనం ఏం చేయకపోయినా.. కనీసం గౌరవిస్తే అదే పదివేలు. అయితే ఓ కవయిత్రి మాత్రం సైనికుల పోరాటాలను, వారి ధైర్య సాహసాలను తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేశారు. 

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఇటీవల మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది జవాన్లు అమరులవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది.. దేశ ప్రజలు అమర జవాన్లకు సెల్యూట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అయితే అసోంకు చెందిన రచయిత్రి శిఖా శర్మ మాత్రం వివాదాస్పద పోస్ట్‌ పెట్టి కలకలం రేపారు.

‘జీతాలు తీసుకుని పని చేసే ఉద్యోగులు కాల్పుల్లో మరణిస్తే అమరులా? అంటూ ఆమె ఆ పోస్టులో ప్రశ్నించారు. అలాగైతే మిగతా సిబ్బంది కూడా అమరవీరులే అవుతారని శిఖాశర్మ పేర్కొన్నారు.

గౌహతికి చెందిన ఉమి దేకా బరువా, కంకణ గోస్వామి‌లు ఫేసుబుక్‌‌లో పోస్టు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు శిఖాశర్మపై కేసు నమోదు చేసుకుని... అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఐపీసీ సెక‌్షన్‌ 294 (ఏ, 124 (ఏ), 500, 506, ఐటీ చట్టం 45 కింద కేసు నమోదు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios