కుంభమేళాలో మెరిసిన హైదరబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్...

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో మెరిసారు. తండ్రితో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. 

 

Saina Nehwal Takes Holy Dip at Prayagraj Mahakumbh 2025 in telugu akp

Kumbhmela 2025 :  మహా కుంభమేళా 2025 కోసం దేశ విదేశాల నుండి భక్తులు ప్రయాగరాజ్ వస్తున్నారు... పవిత్ర సంగమంలో స్నానం చేసి తరిస్తున్నారు. ఇలా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ కూడా బుధవారం కుంభమేళాలో మెరిసారు. ఆమె గంగా, యమునా, సరస్వతి నదుల సంగమప్రాంతంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.

"ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప అనుభూతి. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు. ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి, దీన్ని ప్రపంచ ప్రఖ్యాతం చేస్తారని ఆశిస్తున్నాను." అని సైనా అన్నారు. 

తన తండ్రితో కలిసి త్రివేణి సంగమంలో స్నానం చేశారు సైనా. అయితే తన తల్లితో కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. "ఇది చాలా పెద్ద ఉత్సవం. ఇక్కడికి రావడం నా అదృష్టం" అని ఆమె అన్నారు. "అందరూ ఐక్యంగా ఉండి మన బలమేంటో చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్సవం మన దేశంలో జరగడం గర్వంగా ఉంది." అని ఆమె అన్నారు.

దేశ యువతకు శుభాకాంక్షలు తెలిపిన సైనా నెహ్వాల్.... ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనకు శక్తిని, సానుకూలతను అందిస్తాయని అన్నారు. దేశాభివృద్ధి కోసం ప్రార్థిస్తూ, "మన దేశం మరింత అభివృద్ధి చెందాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను" అని సైనా అన్నారు.

మహా కుంభ 2025 సందర్భంగా దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు సంగమంలో స్నానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ చారిత్రాత్మిక కార్యక్రమాన్ని ఘనంగా, సజావుగా నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios