బాలీవుడ్ నటి స్వర భాస్కర్ పెళ్లిపై విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత సాధ్వి ప్రాచి (Sadhvi Prachi) సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విశ్వహిందూ పరిషత్‌ ఫైర్‌బ్రాండ్‌ నేత సాధ్వి ప్రాచీ.. ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. ఆమె తన సంచలన ప్రకటనలతో నిత్యం చర్చలో నిలుస్తుంది. తాజాగా సినీ నటి స్వర భాస్కర్‌, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఫహద్‌ అహ్మద్‌ల వివాహంపై ఫైర్‌బ్రాండ్‌ నేత సాధ్వి ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బరేలీలోని బహేరీకి చెందిన మహారాష్ట్ర ఎస్పీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఫహద్ అహ్మద్, సినీ నటి స్వర భాస్కర్‌ల వివాహంపై స్పందించారు.

ఆమె మాట్లాడుతూ.. నటి.. శ్రద్ధా ఫ్రిజ్‌లో ఉంచిన 35 ముక్కలను గుర్తుంచుకోవాలని సూటిగా అన్నారు. నటి స్వర ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడతారనీ, ఆమె వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని తనకు ముందే తెలుసుననీ, ఆమె తాను అనుకున్నట్లుగానే.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందని అన్నారు. 

అంతా బాగానే ఉంది. అయితే.. ఆమెకు మరో శ్రద్ధ అవుతుందని తనకు అనిపిస్తుందనీ, శ్రద్ధ లాగే ఆమె శరీరం కూడా 35 ముక్కులుగా ఫ్రిజులో దొరుకుతుంది కావచ్చు. ఆమె ఇలాంటివి ఆలోచించిన తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ.. కుమార్తెలు అలాంటి అడుగు వేసినప్పుడు.. వారు కొన్నిసార్లు సూట్‌కేసులలో, కొన్నిసార్లు గోనె సంచులలో కనిపిస్తారు. ఐఏఎస్ టీనా దాబీ కూడా అలాగే చేశారని సాధ్వి అన్నారు.స్వర భాస్కర్‌ త్వరలో ఇంటికి తిరిగి వస్తుందని అన్నారు. 

ఆదివారం ఆమ్లాలోని సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో జరిగిన మహిళా సమన్వయ సదస్సుకు హాజరయ్యేందుకు సాధ్వి ప్రాచి వచ్చింది. ధార్మిక విద్యతో పాటు తమ కుమార్తెలకు ఉన్నత విద్యను అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆమె.. ఇకపై సనాతనీయులు తమ కుమార్తెలకు ఆయుధాలు ఉపయోగించడం నేర్పించాల్సి వస్తుందన్నారు. ఆడపిల్లలను స్వావలంబనగా తీర్చిదిద్దండి. మహానుభావుల పాత్రలకు జీవం పోయాలని అన్నారు. 

జనాభా నియంత్రణ చట్టానికి ప్రాధాన్యత

అలాగే ఆమె జనాభా నియంత్రణ విషయాన్ని కూడా ఉద్ఘాటించారు. నేడు దేశంలో జనాభా నియంత్రణ, కామన్ సివిల్ కోడ్ చట్టం అవసరమన్నారు. వచ్చే ఐదేళ్లలో భారతదేశం మళ్లీ అఖండ హిందూ దేశంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. భారతీయులందరి పూర్వీకులను హిందువులుగా అభివర్ణించిన రాష్ట్రీయ స్వయం సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటనకు సాధ్వి ప్రాచీ కూడా మద్దతు తెలిపారు. వాస్తవానికి.. కుల వివక్షను విడనాడాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం బరేలీలో అన్నారు. ప్రతి భారతీయుని పూర్వీకులు హిందువులే. వారితో మాట్లాడుతూ ఉండండని అన్నారు. 

ఫిబ్రవరి 16న.. స్వరా భాస్కర్ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమాజ్ వాది పార్టీ నేత ఫహద్ జిరార్ అహ్మద్‌తో తన వివాహాం జరిగినట్లు తెలిపింది. అనంతరం ఆమె స్పందిస్తూ ‘‘కొన్నిసార్లు మన పక్కనే చాలా అవకాశాలు పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతాం.. వాస్తవానికి మనమంతా ప్రేమ కోసమే చూస్తున్నాం. ఫహాద్, తాను మంచి స్నేహితులమనీ, ఆ తర్వాత మా స్నేహం ప్రేమగా మారింది. ఫహద్ జిరార్ అహ్మద్‭ను నా జీవితంలోకి ఆహ్వానించాను.’’ అని అన్నారు. అయితే ఈ వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి, మార్చి 16 న ఢిల్లీలోని సాకేత్‌లోని ఒక హోటల్‌లో బహిరంగ వివాహ వేడుక జరగనుంది. మార్చి 19న బరేలీలోని బహెడిలోని పూర్వీకుల నివాసంలో దావత్-ఎ-వలిమా (రిసెప్షన్) నిర్వహించబడుతుంది. ఫహద్ అహ్మద్ బహెదీలోని ఇస్లాం నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను కాంగ్రెస్ నాయకుడు, సామాజిక కార్యకర్త జర్రార్ అహ్మద్ కుమారుడు.

ఫహద్ ప్రస్తుతం మహారాష్ట్రలోని సమాజ్ వాదీ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. అతని పూర్వీకుల ఇల్లు కూడా బహెదిలో ఉంది. రిసెప్షన్ కోసం బహెదీకి చెందిన నిర్వాణ రిసార్ట్ బుక్ చేయబడింది. మార్చి 16న ఢిల్లీలో పెళ్లి చేసుకున్న తర్వాత.. మార్చి 17న బెహెదీకి వస్తారని ఫహద్ తండ్రి జరార్ అహ్మద్ మీడియాకు తెలిపారు. మార్చి 19న రిసెప్షన్ ఉంటుందని తెలిపారు.