Asianet News TeluguAsianet News Telugu

Siddharth comments:సైనాకు అండగా క్రీడాలోకం..సిద్దార్థ్ పై సర్వత్రా ఆగ్రహం.. స‌ద్గురు ఫైర్ !

Siddharth comments: హీరో సిద్దార్థ్ చేసిన ఓ ట్వీట్ పెను దుమారం రేపుతోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ఆ ట్వీట్ తో సిద్దార్థ్ పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. సైనాకు అండ‌గా క్రీడాలోకం నిలుస్తూ సిద్దార్థ్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తోంది. 

Sadhguru Slams Siddharth For 'distasteful & Disgusting' Remark Against Saina Nehwal
Author
Hyderabad, First Published Jan 10, 2022, 8:39 PM IST

Siddharth comments: హీరో సిద్దార్థ్ చేసిన ఓ ట్వీట్ పెను దుమారం రేపుతోంది. సైనా నెహ్వాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ఆ ట్వీట్ తో సిద్దార్థ్ పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. సైనాకు అండ‌గా క్రీడాలోకం నిలుస్తూ సిద్ధార్ధ్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తోంది. సైనా నేహ్వాల్ పై సిద్ధార్ధ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు ప్ర‌ముఖ క్రికెటర్ సురేష్ రైనా. క్రీడాకారులు తమ దేశం కోసం తమ చెమటను, రక్తాన్ని ధార‌పోస్తార‌ని పేర్కొన్నారు. తమ గౌర‌వానికి, క్రీడా స్పూర్తికి వ్యతిరేకంగా ఇటువంటి విశృంఖల భాష ఉపయోగించడం చాలా బాధ‌క‌ర‌మ‌ని అన్నారు. సాటి క్రీడాకారునిగా సైనాకు అండ‌గా ఉంటాన‌ని, ఈ జుగుప్సాకరమైన భాషను ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

 

సైనా నెహ్వాల్‌పై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నటుడు సిద్ధార్థ్‌పై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు (Sadhguru) జగ్గీ వాసుదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ (Siddharth) వ్యాఖ్యలు 'అత్యంత అసహ్యకరమైనవని' అని సద్గురు  పేర్కొన్నారు. సైనా నెహ్వాల్ జాతికే గర్వకారణం అని ట్వీట్ చేశారు. 

 

త‌న భార్య‌, షట్లర్ సైనా నెహ్వాల్ పై నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ స్పందించారు. మీ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డానికి స‌రైన ప‌దాల‌ను వాడాల్సింద‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు త‌మ‌ను నిరాశను కలిగించాయని పేర్కొన్నారు. 

 

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపాన్ని ప్రస్తావిస్తూ, జనవరి 5న సైనా నెహ్వాల్ స్పందిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. "తమ సొంత ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదు. నేను ఖండిస్తున్నాను. ప్రధాని మోడీపై అరాచకవాదుల పిరికి దాడి ఈ చ‌ర్య" అంటూ పేర్కొన్నారు. దీనికి సిద్ధార్ద్ స్పందిస్తూ.. 'దేశానికి సంరక్షకులుగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ సైనాపై Subtle cock champion of the world అనే పదాలు ఉపయోగించాడు సిద్ధార్థ్. ఇది కాస్త తీవ్రమైన విమర్శలకు కారణం అయింది. సిద్దార్థ్ అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ డబుల్ మీనింగ్ కామెంట్స్ చేసాడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఆడవారిని అవమానపరిచేలా ఉన్నాంటూ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహ పలువురు ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఈ ట్వీట్ పై జాతీయ మహిళ కమిషన్ సిద్దార్థ్‏కు నోటిసులు జారీ చేసింది. అలాగే, ఆయ‌న అకౌంట్ ను నిషేధించాలంటూ ట్విట్ట‌ర్ ఇండియాకు లేఖ రాసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios