Sachin Pilot: కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు రాజకీయాలు రసవత్తవంగా మారుతున్నాయి. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. పలువురు నేతలు అధిష్టానంతో భేటీ అవుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ సోనియాతో భేటీ అయ్యారు. గతంలో పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవులు నిర్వహించారు. అయితే.. తనకు ఈ సారి ముఖ్యమంత్రి పదవి చేయాలన్న కోరిక ఉందన్న విషయాన్ని పైలట్ అధినేత్రి సోనియా ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
Sachin Pilot: కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తవంగా మారుతున్నాయి. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. పలువురు నేతలు అధిష్టానంతో కీలక భేటీ అవుతున్నారు. ఇప్పటికే రాజకీయ చాణక్యుడు.. ఎన్నికల వ్యూహారచన ప్రశాంత్ కిశోర్ పలు కాంగ్రెస్ అధినేత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత వారం రోజుల్లో పీకే, సోనియాలు నాలుగుసార్లు భేటీ కావడం విశేషం.
ఈ తరుణంలో కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు, పక్షం రోజుల్లో సోనియా గాంధీలతో రెండవసారి సమావేశం కావడం గమన్హారం. ఈ భేటీలో రాజస్థాన్ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లో ఎలాగైనా పార్టీని అధికారంలో నిలబెట్టుకోవాలనిఅధిష్టానం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాత్రం ధీమాగా ఉన్నారు. తన స్థానానికి ఎలాంటి ఢోకా లేదని భావిస్తున్నారు. పార్టీ పెద్దలు కూడా నాయకత్వంపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నట్టు ఆయనకు సన్నిహితంగా ఉన్న నాయకులతో కలవరపడకుండా కనిపించారు. అయితే.. సచిన్ పైలెట్ మాత్రం సీఎం పీఠానికే ఎసరుపెట్టినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకుందని అన్నారు. మరోవైపు, పైలట్ క్యాంప్, గార్డును మార్చడం ఇక సాధ్యం కాదని చెప్పింది. రాజస్థాన్‌లోని గ్రౌండ్ పరిస్థితి గురించి హైకమాండ్‌కు తెలుసునని, 2023లో పార్టీ అధికారం కైవసం చేసుకోవాలని లేకపోతే.. 2024 లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాదించారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ..పైలట్ ఏప్రిల్ 8న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను కలిశారు. గురువారం సోనియాతో సమావేశం కోసం ఢిల్లీకి పిలిచినప్పుడు ఆయన సికార్‌లో ఉన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందించిన పునరుద్ధరణ ప్రణాళికపై పార్టీ నాయకత్వం చర్చిస్తున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. అంతకు ముందు బుధవారం జరిగిన చర్చల్లో గెహ్లాట్ పాల్గొన్నారు.
గురువారం సమావేశం అనంతరం పైలట్ విలేకరులతో మాట్లాడుతూ.. 2020లో సోనియా ఏర్పాటు చేసిన కమిటీ సంస్థలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ కొన్ని సరైన మార్పులు చేసిందన్నారు. ఆ దిశగానే పార్టీ ముందుకు సాగాలన్నారు. ఏఐసీసీ కమిటీ ద్వారా కొన్ని పనులు జరిగాయని, అయితే మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నారు. మనం ఐక్యంగా పని చేస్తే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని దీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో చాలా విషయాలు చర్చించినట్టు తెలిపారు. ప్రజాసమస్యల కోసం చేపట్టాల్సిన పోరాటంపై చర్చించామనీ, కేంద్రం, రాష్ట్రాల్లో బీజేపీ అణచివేత విధానాలను ప్రజల దృష్టికి తీసుకవెళ్లాలని సూచించారు. సామాన్య ప్రజల కోసం పని చేసేందుకు, వారి గొంతుకగా మారేందుకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు, ప్రక్రియపై చర్చించామని, రాజస్థాన్‌లో రాజకీయ పరిస్థితులపై నేను ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను, దానిపై చర్చించాం” అని అన్నారు.
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన నెలల తర్వాత, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. రాజస్థాన్‌లో పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం నాయకులందరూ ఐక్యంగా పని చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసక్తిగా ఉన్నారని పైలట్ చెప్పారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయం రాజస్థాన్‌లో వుందని, అయితే తాము కష్టపడి, సరైన మార్గదర్శనంలో వెళితే, తిరిగి కాంగ్రెస్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే.. తన భవిష్యత్ ఎలా వుంటుందన్న చర్చ కూడా పైలట్ సోనియాతో చేసినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవులు నిర్వహించారు. అయితే సీఎం గెహ్లోత్‌తో విభేదాల కారణంగా అధిష్ఠానం ఆయన్ను ఆ పదవుల నుంచి తొలగించింది. అయితే.. తనకు ముఖ్యమంత్రి పదవి చేయాలన్న కోరిక ఉందన్న విషయాన్ని పైలట్ అధినేత్రి సోనియా ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
