Asianet News TeluguAsianet News Telugu

మరోసారి సీఎం కుర్చీ కోసం పైలట్ పేచీ? ‘అనిశ్చితికి ముగింపు పలకాలి’.. ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ వ్యాఖ్యలు

రాజస్తాన్ సీఎం పీఠం కోసం మరోసారి అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ పోరు రచ్చ బండకు ఎక్కబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. రాజస్తాన్‌లో నెలకొన్న అనిశ్చితి వాతావరణానికి ముగింపు పలకడానికి సమయం ఆసన్నమైందని సచిన్ పైలట్ అన్నారు. సీఎం పోస్టును దృష్టిలో పెట్టుకునే సచిన్ పైలట్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చర్చ జరుగుతున్నది.
 

sachin pilot in a bid to cm seat says its time to end the climate of indecision
Author
First Published Nov 2, 2022, 2:11 PM IST

జైపూర్: రాజస్తాన్‌లో మరోసారి సీఎం కుర్చీ చుట్టూ రాజకీయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోసారి అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ పోరు రచ్చకు ఎక్కబోతున్నట్టు తెలుస్తున్నది. మరో 13 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని అన్నారు. అశోక్ గెహ్లాట్ టీమ్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. అశోక్ గెహ్లాట్‌ను అధిష్టానం కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసిన తరుణంలో ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ గెహ్లాట్ అనునాయ వర్గ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

హిమాచల్ ప్రదేశ్‌లో క్యాంపెయినింగ్ చేస్తున్న సచిన్ పైలట్ ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మొదట పార్టీలో అంతర్గతంగా నేతలు ఏమనుకుంటున్నారో వింటానని, ఆ తర్వాతే మాట్లాడుతానని చెప్పారు. తాజాగా మాట్లాడుతూ, రాజస్తాన్‌లో నెలకొన్నఅనిశ్చిత వాతావరణానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని అన్నారు. రాజస్తాన్ పరిస్థితులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ అబ్జర్వర్ కేసీ వేణుగోపల్ ఇది వరకే పేర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అందరికీ ఒకే న్యాయాన్ని అందిస్తుందని, సీనియర్లు అనే మినహాయింపులు ఏమీ ఇవ్వకుండా అందరితోనూ సమానంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కాబట్టి, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు వివరించారు.

Also Read: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ప‌ని చేస్తుంది - సీఎం అశోక్ గెహ్లాట్

రాజస్తాన్ పరిస్థితులను అబ్జర్వర్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారని, ఇది కచ్చితంగా ఇన్‌డిసిప్లేనే అని పార్టీ కూడా పేర్కొందని గుర్తు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని కోరారు. సీఎం పోస్టు కోసం సచిన్ పైలట్ మరోసారి పట్టుపట్టడానికే ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉన్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. 

Also Read: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ప‌ని చేస్తుంది - సీఎం అశోక్ గెహ్లాట్

కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం అశోక్ గెహ్లాట్‌ను ఎంచుకుంటే.. సీఎం పదవి సచిన్ పైలట్‌కు వరిస్తుందని ఊహించారు. ఒక్కరికి, ఒక్క పదవి అంటూ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికైతే గెహ్లాట్ తన సీఎం పదవి వదులుకోవాలి. సరిగ్గా అదే సమయంలో అశోక్ గెహ్లాట్ వర్గీయులు రాజీనామాలు చేశారు. అశోక్ గెహ్లాట్‌ను సీఎంగానే కొనసాగించాలని, లేదంటే.. ఆయన సూచించిన ఎమ్మెల్యేను సీఎం చేయాలని డిమాండ్ చేశారు. అది కూడా సచిన్ పైలట్ కాకుండా.. ఆయనతోపాటు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఈ అవకాశం వర్తించదని కూడా షరతు పెట్టారు. ఈ తిరుగుబాటుతో పార్టీ అధిష్టానం అసంతృప్తికి గురైంది. అశోక్ గెహ్లాట్‌ను అధ్యక్ష అభ్యర్థి పోటీలోకి తీసుకోలేదు. ఆ తర్వాత తన అనుయాయుల రాజీనామాలపై క్షమాపణలు చెప్పారు. దీంతో చేతికి చిక్కినట్టే చిక్కి సీఎం పోస్టు సచిన్ పైలట్‌కు మళ్లీ దూరమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios