Asianet News TeluguAsianet News Telugu

పాక్‌తో లింక్..! సారే జహాసే అచ్ఛా గీత రచయిత ముహమ్మద్ ఇక్బాల్ పాఠం తొలగింపు..! డీయూ కౌన్సిల్ తీర్మానం

సారే జహాసే అచ్చా గీత రచయిత ఇక్బాల్ గురించిన పాఠాన్ని ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్ నుంచి తొలగించడంపై తీర్మానం తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ తీర్మానం ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉన్నది. తుది నిర్ణయం జూన్ 9న వెలువడే అవకాశం ఉన్నది.
 

saare jahan se achha song writer poet muhammad iqbal dropped from DU political science syllabus kms
Author
First Published May 27, 2023, 2:12 PM IST

muhammad iqbal: ఢిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఓ కీలక తీర్మానం చేసింది. సారే జహాసే అచ్చా అనే ప్రఖ్యాత దేశ భక్తి గీతాన్ని రాసిన ముహమ్మద్ ఇక్బాల్ పై పాఠాన్ని పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి తొలగించాలనే తీర్మానాన్ని ఆమోదించింది. పేరు చెప్పడానికి ఇష్టపడని కౌన్సిల్ సభ్యులు కొందరు చెప్పారు.

ముహమ్మద్ అల్లామా ఇక్బాల్ పాకిస్తాన్ జాతీయ కవి. పాకిస్తాన్ అనే ఆలోచనకు జీవం పోసిందే ఈ కవి ముహమ్మద్ ఇక్బాల్ అని తరుచూ చెబుతుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ బీఏ ఆరో సెమిస్టర్ పేపర్‌లో మాడ్రన్ ఇండియన్ పొలిటికల్ థాట్ అనే చాప్టర్‌ ఉన్నది. ఈ చాప్టర్‌లో సారే జహాసే అచ్చా గీత రచయిత ముహమ్మద్ ఇక్బాల్ గురించి ఉన్నది.

ముహమ్మద్ ఇక్బాల్ సమైక్య భారతావనిలో 1877లో జన్మించారు.

ఈయనపై పాఠం తొలగించే నిర్ణయం ప్రస్తుతం యూనివర్సిటీ ఈసీ వద్ద ఉన్నది. జూన్ 9వ తేదీన ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఆ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

ఢిల్లీ యూనివర్సిటీ 1014వ అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుపై చర్చ జరుగుతుండగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యోగేశ్ సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. భారత విభజనకు పునాది వేసిన వారిని సిలబస్ నుంచి తొలగించడం సరైనందే అని పేర్కొన్నారు. 

Also Read: నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ సహా ఏడుగురు ముఖ్యమంత్రులు డుమ్మా

వీసీ ప్రతిపాదనను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇదే సమావేశంలో నాలుగో, ఐదో, ఆరో సెమిస్టర్ల సిలబస్‌కు సంబంధించిన యూజీ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2022 తీర్మానాన్నీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్, ఇతరుల గురించిన బోధనలు ఉండాలని వీసీ పేర్కొన్నారు.

పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో మార్పుల గురించి ఓ తీర్మానం తీసుకువచ్చారు. ఈ తీర్మానం ప్రకారం ఇక్బాల్ పై చాప్టర్‌ను తొలగించాలని ఉన్నది ని ఓ అకడమిక్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.

కాగా, ఈ నిర్ణయాన్ని ఏబీవీపీ స్వాగతించింది.

Follow Us:
Download App:
  • android
  • ios