Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ ముస్లిం లీగ్‌గా మారడంతో.. బీజేపీ కాంగ్రెస్‌గా మారింది

ఒకప్పుడు కాంగ్రెస్‌ను ముస్లింలీగ్ విమర్శించిన విధంగానే నేడు కాంగ్రెస్ బీజేపీని విమర్శిస్తోంది. బీజేపీని హిందూ పార్టీఅని, ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్ర వేస్తూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ మార్పు ఎంత దారుణంగా ఉందని ప్రముఖ కాలమిస్ట్, తమిళ రాజకీయ వార్త పత్రిక తుగ్లక్‌కు సంపాదకుడు ఎస్ గురుమూర్తి అభిప్రాయపడ్డారు. 

S Gurumurthy Take As Congress turned into Muslim League, BJP became the Congress  KRJ
Author
First Published May 23, 2024, 8:43 PM IST

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు జరుగుతున్న ఎన్నికల చర్చలు కాంగ్రెస్ - బిజెపి, కాంగ్రెస్ - ముస్లిం లీగ్, కాంగ్రెస్- కమ్యూనిస్టుల మధ్య చారిత్రక వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఒకప్పుడు మద్దతిచ్చిన సిద్దాంతాలనే ప్రస్తుతం కాంగ్రెస్ సవాలు చేస్తోంది. గతంలో వ్యతిరేకించిన వైఖరిని నేటీ కాంగ్రెస్ అవలంబిస్తుంది. ఈ రాజకీయ రూపాంతరం సైద్ధాంతిక ప్రవాహాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పు అకస్మాత్తుగా సంభవించినవి మాత్రం కాదు. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుత ఎన్నికల చర్చల వెనుక కారణాలను అర్థం చేసుకోవడానికి ఈ చరిత్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

1969 తర్వాత కాంగ్రెస్ పతనం ప్రారంభం.

‘కాంగ్రెస్ లేని భారతదేశం’ అనే బీజేపీ నినాదాన్ని తుగ్లక్ పత్రిక తిరస్కరించింది. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ క్షీణించినప్పటికీ, దానిని వదిలిపెట్టడం దేశ ప్రయోజనాల కోసం కాదు. కుటుంబ ప్రయోజనాల కోసం 1969లో ఇందిరాగాంధీ ప్రారంభించిన విభజన తర్వాత కాంగ్రెస్ జాతీయ గుర్తింపు, సూత్రాలు, నైతికత క్షీణించడం ప్రారంభమైంది. కాంగ్రెస్ ఒకప్పుడు జాతీయవాదానికి పర్యాయపదంగా పరిగణించబడింది. కామరాజ్, మొరార్జీ దేశాయ్, నిజలింగప్ప వంటి ప్రముఖులను పక్కనపెట్టి,  అంతర్గత కలహాలు, కుతంత్రాల ద్వారా ఇందిర గాంధీ పార్టీపై నియంత్రణ సాధించింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ తన పూర్తిగా ఆస్తిత్వాన్ని కోల్పోయింది.

రాజకీయ ప్రయోజనాల కోసం.. 1971 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ తన ప్రత్యేకతను కోల్పోయింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన స్రవంతి నుండి వైదొలిగిందని తుగ్లక్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు చో విచారం వ్యక్తం చేశారు. 1969లో ప్రారంభమైన కాంగ్రెస్ క్షీణత.. నేటీ పరిణామాలతో తీవ్రస్థాయికి చేరిందని తుగ్లక్ అభిప్రాయపడుతుంది. చారిత్రక సంఘటనలు కూడా అవే చెబుతున్నాయి. 1980లలో కాంగ్రెస్ విధాన మార్పులు ముస్లిం లీగ్‌తో జతకట్టింది.2024 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తుంది.

ముస్లిం లీగ్‌గా కాంగ్రెస్ రూపాంతరం

స్వాతంత్ర్యానికి ముందు ముస్లిం లీగ్ ముస్లిం రాజకీయ రిజర్వేషన్ కోసం వాదించింది. ప్రత్యేక గుర్తింపు కోసం పోరాటం చేసింది. అయితే.. 1932లో మహాత్మా గాంధీ నిరాహారదీక్షతో కుల ఆధారిత రిజర్వేషన్లకు బ్రిటిష్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసించింది. కానీ,తదనంతరం 1937లో బ్రిటీష్ తన రాజకీయ స్థిరత్వం కోసం .. ముస్లింలు, భారతీయుల మధ్య విభజనను ప్రేరేపిస్తూ.. షరియా చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ పరిణామం ముస్లిం లీగ్ కు ఊతమిచ్చింది. ఈ పరిణామంతో 1940లో ముస్లింలకు ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేసింది. కానీ, ఆ వాదనకు తొలుత కాంగ్రెస్ పూర్తి విరుదమనీ, హిందువులు, ముస్లింలను ఒకే సంఘంలో భాగమని ఐక్యతను చాటింది. కానీ, తరువాత జరిగిన పరిణామాలతో ఆనాటి (నేటి) కాంగ్రెస్ ముస్లిం లీగ్ వేర్పాటువాద భావజాలంతో జతకట్టి.. విభజనకు మద్దతు ఇచ్చింది. తొలుత ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్సే.. రాజ్యాంగ పరిషత్ ఆమోదించడానికి కూడా కారణమైంది. 

నేటి కాంగ్రెస్ ముస్లిం లీగ్ వేర్పాటువాద భావజాలంతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించింది. నేటి కాంగ్రెస్ అలాంటి రిజర్వేషన్లను వాగ్దానం చేస్తుంది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో చేర్చి రిజర్వేషన్లు కల్పించింది. మునుపటి కాంగ్రెస్ హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధుల మధ్య సమానత్వాన్ని సూచించింది, షెడ్యూల్డ్ కులాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. కానీ, దేశ ఆస్తులపై ముస్లింలకే తొలి హక్కు అని నేటి కాంగ్రెస్ చెబుతోంది.

1938లో ముస్లిం లీగ్‌కు చెందిన బీర్‌పూర్ కమిటీ కాంగ్రెస్‌ను హిందూ అనుకూలమనీ, ముస్లిం వ్యతిరేకి అని ఆరోపించింది. 1986లో షరియా చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల డిమాండ్‌కు తలొగ్గిన కాంగ్రెస్ షాబానో కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది. ఈ పరిణామం ముస్లిం లీగ్ భావజాలానికి కాంగ్రెస్ మరింత చేరువవుతున్నట్లు ఇది వెల్లడించింది. తదనంతరం ముస్లిం లీగ్‌ను పోలి ఉండే చట్టబద్ధమైన హిందూ డిమాండ్లను, రామ మందిర నిర్మాణాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఈ పరివర్తన దేశానికి, కాంగ్రెస్‌కు విచారకరం.

  కమ్యూనిస్టుగా కాంగ్రెస్

1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణను వ్యతిరేకించిన కామరాజ్, మొరార్జీ, నిజలింగప్ప వంటి నాయకులను సంఘ వ్యతిరేకులు, పెట్టుబడిదారీ ప్రభావశీలులుగా పేర్కొంటూ కాంగ్రెస్‌ను విభజించారు. సోవియట్ రష్యా ప్రభావంతో కమ్యూనిస్ట్ సలహాలపై ఇందిర ఆధారపడటం గురించి పెద్దగా తెలియదు. 1971లో చైనా  ప్రభావంతోనే ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని సవరించింది.  న్యాయమైన పరిహారం లేకుండా ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. విస్తృతమైన జాతీయీకరణను సమర్థించింది. ఈ పరిణామమే బ్యాంకులు, బొగ్గు గనులు, బీమా కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణకు దారితీసింది. రాష్ట్ర జోక్యం యొక్క కమ్యూనిస్ట్ సూత్రాలకు అనుగుణంగా ఉంది. ఆ విధంగా కాంగ్రెస్ అన్ని రంగాలలో ప్రభుత్వ జోక్యాన్ని స్వీకరించి, కమ్యూనిస్ట్ పార్టీకి అద్దం పట్టింది. 

ఒకప్పుడు కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకి కాంగ్రెస్ నాటకీయంగా ఆ భావజాలానికే పట్టం కట్టింది.1970వ దశకంలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన అదే కాంగ్రెస్ తెలంగాణ, కేరళలో కమ్యూనిస్టు ఉద్యమాలపై క్రూరమైన అణిచివేతలను నిర్వహించింది. ఇది ఒకప్పుడు ఖండించిన వ్యూహాలకు అద్దం పడుతుంది. ఇందిరా గాంధీ కామరాజ్ వంటి గౌరవనీయమైన జాతీయవాదులను వారి వ్యతిరేకత కోసం అమెరికన్ ఏజెంట్లుగా కూడా తిట్టారు. 1990లో సోవియట్ రష్యా పతనంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లను పాశ్చాత్య పెట్టుబడిదారీ ఆదర్శాలను స్వీకరించి సోషలిజాన్ని విడిచిపెట్టడానికి ప్రేరేపించింది. వాజ్‌పేయి నుండి మన్మోహన్ సింగ్ వరకు, ఇప్పుడు మోడీ పరిపాలన వరకు వచ్చిన ప్రభుత్వాలు, జాతీయీకరణ నుండి ప్రైవేటీకరణ విధానాలకు మారుతున్న వారి ప్రత్యేక విధానాల ద్వారా సోషలిస్టు ఆర్థిక వక్రీకరణలను సరిదిద్దడానికి ప్రయత్నించాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వనరుల పునఃపంపిణీ అంటూ మునుపటి సూత్రాలను తెరపైకి తేవడం గమనార్హం.  

 కుల రాజకీయాల ప్రాతిపదిక కాంగ్రెస్ తెర 

స్వాతంత్య్ర అనంతరం కాంగ్రెస్ పార్టీలో సైద్దాంతికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. 1989లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుతూ వీపీ సింగ్ నేతృత్వంలోని మండల్ ఉద్యమం సందర్భంగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ‘దేశాన్ని కులాల వారీగా విభజించొద్దు’ అని వేడుకున్నారు. కానీ, బోఫోర్స్ కుంభకోణం తెరపైకి రావడంతో ఆ ఉద్యమాన్ని నిరోధించడంలో విఫలమయ్యారు. అలాగే..

ఉత్తరాది రాష్ట్రాల్లో OBC పార్టీల ప్రాబల్యం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామం కాంగ్రెస్ పతనానికి దోహదపడింది. అదే సమయంలో.. రామ మందిరం ఉద్యమం ప్రారంభం కావడంతో కాంగ్రెస్‌కు హిందూ మద్దతు తగ్గింది. ఇలా రెండు రంగాల్లో పార్టీ బలహీనపడింది. రామమందిరం సమస్య కారణంగా హిందూ మద్దతును కోల్పోగా.. మండల్ ఉద్యమం కారణంగా OBC మద్దతు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం  ముస్లిం లీగ్ సిద్దాంతాలకు మద్దుతు ఇవ్వడమే అంటారు. 

ఇక 2004లో ముస్లిం లీగ్ మద్దతు, విభజన రాజకీయాలతో కాంగ్రెస్‌కు అధికారం చేక్కించుకుంది. ఆ సారి దశాబ్ద కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు తెర తీసింది. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ పరిమాణాలన్ని బీజేపీ పునరుజ్జీవనానికి దారితీశాయి. 2014లో మోడీ నేత్రుత్వంలోని బీజేపీ గణనీయమైన విజయం సాధించింది. బీజేపీ పాలన ప్రగతి వైపు అడుగులు వేయడంతో .. 2019 ఎన్నికలలో కాంగ్రెస్  మళ్లీ ఓటమిని ఎదుర్కోడం. రాడికల్ ముస్లిం బుజ్జగింపు రాజకీయాలతో పట్టు కోల్పోవడం, OBC ఓట్లను తిరిగి పొందేందుకు కాంగ్రెస్ కుల గణన కోసం వాదించడం ప్రారంభించింది. ఈ మార్పు అంతకుముందు కాంగ్రెస్, ముఖ్యంగా రాజీవ్ గాంధీ నాయకత్వంలోని సూత్రాల నుండి దురదృష్టకర నిష్క్రమణను గుర్తించింది.

ఆనాటి కాంగ్రెస్ గా..  నేటీ బీజేపీ.. 

జాతీయవాద మూలాలకు దూరంగా ముస్లిం లీగ్, కమ్యూనిస్టులు, మండల్ పార్టీల సిద్ధాంతాల వైపు కాంగ్రెస్ మొగ్గు చూపడంతో ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని భావించింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. 1949లో అయోధ్య నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రాఘవ దాస్ రామజన్మ భూమి రెస్క్యూ ఉద్యమాన్ని ప్రారంభించారు. గాంధేయవాది అయిన ఆయనను మహాత్మా గాంధీ ముద్దుగా "బాబా" రాఘవ దాస్ అని పిలిచేవారు. నెహ్రూ ప్రభావంతో కాంగ్రెస్ రామమందిర ప్రయత్నాన్ని విరమించుకున్నప్పుడు.. బిజెపి ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. గాంధీ నాయకత్వంలో సాగిన  రామరాజ్యాన్ని బీజేపీ తన రామాలయ ఉద్యమంలో పూర్తిగా విలీనం చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పక్కన పెట్టిన వందేమాతరం, భారత్ మాతా కీ జై వంటి చిహ్నాలను బీజేపీ పునరుద్ధరించింది. వాటిని జాతీయ చిహ్నాలుగా ఆదరించింది. ఈ విధంగా  స్వాతంత్ర్యానికి పూర్వం కాంగ్రెస్ అనుసరించిన సిద్దాంతాలను బీజేపీ అందిపుచ్చుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ను ముస్లిం లీగ్ ఎలా కొట్టిపారేసిందో.. బీజేపీని హిందూ పార్టీ అని, ముస్లిం వ్యతిరేకి అని ముద్ర వేస్తూ నేడు బీజేపీని కాంగ్రెస్ విమర్శిస్తోంది. పరివర్తన ఎంత దుర్మార్గంగా ఉంది?

కాంగ్రెస్ ఫుల్ టాసులు.. మోడీ సిక్సర్లు

నేడు కాంగ్రెస్‌కు ముస్లిం లీగ్‌, ముస్లిం అనుబంధ సంస్థలతో సత్సంబంధాలున్నాయనీ, ముస్లింల బుజ్జగింపు, కులం, కమ్యూనిస్టు రాజకీయాలకు సంబంధించి రాహుల్, సామ్ పిట్రోడా, ఇతర కాంగ్రెస్ నేతలను ప్రధాని నరేంద్రమోడీ ఏకీపారేస్తున్నారు. జాతీయ వనరులను పంచుకుంటామని సామ్ పిట్రోడా సంచలన ప్రకటన చేసినప్పుడు  ముస్లింలు ప్రాథమిక లబ్ధిదారులేనా ప్రధాని ఘాటుగా ప్రశ్నించారు. ముస్లిం సుల్తానులు హిందూ రాజులను, వారి భూ కబ్జాలు గురించి కాంగ్రెస్  మౌనం వహించడాన్ని ప్రధాని సవాలు చేశారు.

OBC రిజర్వేషన్లు అంటే.. అందులో ముస్లిం రిజర్వేషన్లు లేవా అని ప్రశ్నిస్తాడు. ఇలా కాంగ్రెస్ వైఖరిని ప్రతి విషయంలో బీజేపీ ప్రశ్నిస్తూనే  ఉంది. తాజాగా మితిమీరిన వాక్చాతుర్యాన్ని ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం రెండు పార్టీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వాడివేడి ఎన్నికల చర్చలో ప్రధాని మోదీ, రాహుల్ సహా ఇరుపక్షాలు ఆత్మనిగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు ముగిసే వరకు స్వీయ నియంత్రణను కొనసాగించాలని, గౌరవప్రదమైన ప్రచారం నిర్వహించాలని ఇరుపక్షాలను కోరుతున్నాము.

గమనిక: ఈ వ్యాసం తొలుత తమిళంలోని తుగ్లక్ వీక్లీ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఈ వ్యాసంలో అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios