Russia Ukraine Crisis: భార‌త్ స‌త్తాకు.. ర‌ష్యాతో మంచి స్నేహ‌బంధం ఉంద‌ని నిరూపిస్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రష్యా అంతరిక్ష ప్ర‌యోగ రాకెట్‌పై ఉన్న యూఎస్, యూకే, జపాన్ జెండాలను తొల‌గించిన ర‌ష్యా.. భార‌త్ జెండాను మాత్రం ట‌చ్ చేయ‌లేదు.  

Russia: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. దానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు గుర్తుప‌ట్ట‌లేని విధంగా మారాయి. ప్ర‌జ‌లు ప్ర‌ణాలు ర‌క్షించుకోవ‌డానికి అండ‌ర్ గ్రౌండ్ షెల్ట‌ర్స్ లో త‌ల‌దాచుకుంటున్నారు. అయితే, ప్ర‌పంచ దేశాలు ర‌ష్యా తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆంక్ష‌లు విధిస్తూ.. హెచ్చ‌రిస్తున్నాయి. అయితే, ఆ హెచ్చ‌రిక‌ల‌ను లెక్క‌చేయ‌ని ర‌ష్యా.. దూకుడుగా ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్ పై దాడుల‌ను పెంచింది. ప్ర‌పంచ దేశాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో పుతిన్ ఆ దేశ న్యూక్లియ‌ర్ వెప‌న్స్ అధికారుల‌ను సిద్ధంగా ఉండాలంటూ సూచించ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. 

ఈ క్రమంలోనే అమెరికా, బ్రిట‌న్‌, జ‌పాన్ వంటి దేశాలు ఆంక్ష‌లు మ‌రింత‌గా పెంచుతున్నాయి. ఇక భార‌త్ స‌త్తాకు.. ర‌ష్యాతో మంచి స్నేహ‌బంధం ఉంద‌ని నిరూపిస్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రష్యా అంతరిక్ష ప్ర‌యోగ రాకెట్‌పై ఉన్న యూఎస్, యూకే, జపాన్ జెండాలను తొల‌గించిన ర‌ష్యా.. భార‌త్ జెండాను మాత్రం ట‌చ్ చేయ‌లేదు. వివ‌రాల్లోకెళ్తే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రత‌ ఇప్పుడు అంతరిక్షంలోకి చేరుకుంది, రష్యా త‌న అంతరిక్ష ప్ర‌యోగ రాకెట్‌పై ఉన్నఅమెరికా, బ్రిట‌న్‌, జ‌పాన్ జెండాల‌ను తొల‌గించింది. అయితే, రష్యన్లు రాకెట్‌లో భారత జెండాను అలాగే ఉంచారు. రష్యా అంతరిక్ష సంస్థ ROSCOSMOS రాకెట్‌కు మళ్లీ రంగులు వేయడాన్ని ధృవీకరించింది. కొన్ని జెండాలు లేకుండా రాకెట్ 'మరింత అందంగా' కనిపిస్తుంద‌ని పేర్కొంది. 

క‌జ‌కిస్థాన్ లోని బిక‌నేరు అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రం నుంచి ప్ర‌యోగించే స్పేస్ రాకెట్ ద్వారా వివిధ దేశాల భాగ‌స్వామ్యంతో 36 వ‌న్ వెబ్ శాటిలైట్ల‌ను ప్ర‌యోగించ‌నున్నారు. అయితే, ఈ రాకెట్ పై ఉన్న అమెరికా, బ్రిట‌న్, జ‌పాన్ జెండాల‌ను తొల‌గించిన ర‌ష్యా.. భార‌త్ జెండాను మాత్రం అలాగే, ఉంచింది. రష్యా అంతరిక్ష సంస్థ ROSCOSMOS చీఫ్ డిమిత్రి రోగోజిన్ ఈ విష‌యంపై స్పందిస్తూ.. "లాంచర్లు... కొన్ని దేశాల జెండాలు లేకుండా, మా రాకెట్ మరింత అందంగా ఉంటుందని నిర్ణయించుకున్నారు" అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మీడియోను సైతం ఆయ‌న పంచుకున్నారు. 

Scroll to load tweet…

కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడిని అమెరికా, బ్రిటన్, జపాన్, యూరప్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ఈ దాడులను ఆపాలని హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్ కు మద్ధతు ప్రకటిస్తూ.. రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక భారత్ మాత్రం ఏ దేశానికి మద్ధతు ప్రకటించలేదు. ఇరు దేశాల మధ్య తటస్థంగా వ్యవహరిస్తోంది. శాంతియుతంగా.. చర్చల ద్వారా రెండు దేశాలు తమ వివాదాలను పరిష్కరించుకోవాలని ప్రకటించింది. చాలా కాలం నుంచి రష్యాతో మనకు ఉన్న సంబంధాల నేపత్యంలో భారత్ ఈ వైఖరిని ప్రదర్శిస్తోంది.