నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.దీంతో కార్యాలయానికి భద్రతను పెంచారు.

నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఇవాళ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విషయాన్ని నాగ్‌పూర్ సీపీ అమితేష్ కుమార్ తెలిపారు. దీంతో పాటు ఈ విషయమై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిందని చెబుతున్నారు. మహల్ ప్రాంతంలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు.

ముంబైలో కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని చోట్ల బాంబులు పేలుస్తానని బెదిరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం పోలీసులు సమాచారం అందించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బిడిడిఎస్), డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి, ఆవరణలో క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, అయితే అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు, ముందు జాగ్రత్త చర్యగా పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు డిసిపి గోరఖ్ భామ్రే తెలిపారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో నిందితుడు నరేంద్ర కవ్లేను సెంట్రల్ ముంబైలోని ధారవి లో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. శుక్రవారం రాత్రి, శనివారం నగరంలో మూడు నాలుగు చోట్ల పేలుళ్లు జరుగుతాయని కవ్లే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమీ మాట్లాడలేదు.