Asianet News TeluguAsianet News Telugu

మరుగుదొడ్లో మతిపోగొట్టే బంగారం... రూ.61 లక్షల విలువైన..

మంగళూరు విమానాశ్రయంలో ఓ టాయిలెట్లో  రూ.61 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్ట్ బాత్రూంలో ఇత్త పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడడంతో అధికారులు షాక్ అయ్యారు. వెంటనే ఆ బంగారాన్ని సీజ్ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో ఈ బంగారాన్ని పట్టుకున్నామని అధికారులు తెలిపారు.

rs 60 lakh worth gold in airport toilet at karnataka - bsb
Author
Hyderabad, First Published Feb 26, 2021, 10:25 AM IST

మంగళూరు విమానాశ్రయంలో ఓ టాయిలెట్లో  రూ.61 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్ట్ బాత్రూంలో ఇత్త పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడడంతో అధికారులు షాక్ అయ్యారు. వెంటనే ఆ బంగారాన్ని సీజ్ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో ఈ బంగారాన్ని పట్టుకున్నామని అధికారులు తెలిపారు.

కేరళ కాసరగోడుకు చెందిన అబ్దుల్‌ రషీద్, అబ్దుల్‌ నిషాద్‌లు ఈ నెల 23న విదేశాల నుంచి చాటుగా బంగారాన్ని తీసుకువచ్చారు. దీన్ని విమానాశ్రయం నుంచి బైటికి తీసుకువెళ్లే దారిలేక సమయం చూసుకుని తరలిద్దామని విమానాశ్రయం మరుగుదొడ్డిలో దాచారు. 

దీన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు అబ్దుల్ రషీద్ దాచిపెట్టిన 638 గ్రాముల బంగారం, నిషాద్ దాచిపెట్టిన  629 గ్రాముల బంగారం బిస్కెట్ ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 

బెంగళూరులో దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఖుర్షీద్ (41), ను అరెస్ట్ చేసి రూ. 61.50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios