Asianet News TeluguAsianet News Telugu

రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు : ఢిల్లీ పాటియాలా కోర్టుకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్...

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురువారం ఢిల్లీలోని పాటియాలా హైకోర్టుకు విచారణకు హాజరయ్యారు. బెయిల్ కోసం మధ్యంతర ఉపశమనం ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం గురువారం పిటిషన్‌ను దాఖలు చేసింది.

Rs. 200 crore money laundering case: Jacqueline Fernandez appeared in Delhi Patiala court
Author
First Published Nov 10, 2022, 12:33 PM IST

పాటియాలా : మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద పాటియాలా హౌజ్ కోర్టులో ఈరోజు విచారణ కొనసాగుతోంది. దీంతో జాక్వెలిన్ కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతోంది. కోర్టులో విచారణ సందర్భంగా పింకీ ఇరానీ కూడా హాజరయ్యారు. మీ వద్ద అన్ని పత్రాల కాపీలు ఉన్నాయని పింకీ న్యాయవాదిని కోర్టు తన సమాధానంలో ప్రశ్నించింది. మరోవైపు ఈ కేసులో జాక్వెలిన్ కు ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించగా.. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దర్యాప్తులో ఎప్పుడూ సహకరించలేదని.. సాక్ష్యాలు తెరపైకి వచ్చినప్పు్డు మాత్రమే వెల్లడిస్తానని పేర్కొంది. సుకేష్ ను కలిసిన 10 రోజుల్లోనే అతని నేర చరిత్ర గురించి జాక్వెలిన్ కు తెలియజేసినట్లు ఈడీ పేర్కొంది. ఆమె సాధారణ వ్యక్తి కాదు. ఆర్థిక వనలు అధికంగా ఉణ్న బాలీవుడ్ నటి అని తెలిపింది. 

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌‌ ఫెర్నాండెజ్‌కు మరో షాక్.. సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

200కోట్ల మనీలాండరింగ్ కేసు అసలేంటి?
200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. సుకేస్ ప్రభావవంతమైన వ్యక్తులతో పాటు చాలామందిని మోసం చేశాడని ఆరోపించారు. 200 కోట్ల రికవరీ కేసులో జాక్వెలిన్ నిందితురాలిగా ఆగస్ట్ 17న ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో పలువురు సాక్షులు, సాక్ష్యాలను ఆధారం చేసుకున్నారు. ఆ తరువాత కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ను చేర్చడంతో ఆమె తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios