తెలంగాణ పసుపునకు, ఆంధ్ర మిర్చీకి ఊరట: నిర్మలా సీతారామన్
గ్రామీణ ఆహార ఉత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆహార ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో మార్కెట్ వసతిని కల్పించడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యంగా మంత్రి తెలిపారు.
న్యూఢిల్లీ: గ్రామీణ ఆహార ఉత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆహార ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో మార్కెట్ వసతిని కల్పించడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యంగా మంత్రి తెలిపారు.
శుక్రవారం నాడు సాయంత్రం కేంద్ర మంత్రి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ది గాంచిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో పసుపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిర్చికి ప్రసిద్ది చెందిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తామని చెప్పారు.
also read:వ్యవసాయ మౌళిక సదుపాయాలకు రూ. 1 లక్ష కోట్లు: నిర్మలా సీతారామన్
ఈ పంటలను ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ కోసం మైక్రో ఫుడ్ ఎంటర్ ప్రైజెస్ పనిచేస్తాయన్నారు. ఈ సంస్థకు రూ. 10వేల కోట్ల రూపాయాలను కేటాయిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు.
స్థానికంగా తయారైన ఆహార ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ కు చేరేందుకు ప్రయత్నం చేయడమే తమ ప్రభుత్వం ఉద్దేశ్యంగా చెప్పారు. సుమారు 2 లక్షల ఎంటర్ ప్రైజెస్ ప్రయోజం పొందేలా ప్లాన్ చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అదిక ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం ప్రకటించింది.