Asianet News TeluguAsianet News Telugu

రాజస్తాన్‌లో రూ. 1 కోటికి మించి ఫేక్ కరెన్సీ సీజ్.. ప్రింటర్, మెషీన్‌లు స్వాధీనం

రాజస్తాన్‌లో నకిలీ నోట్ల వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. సుమారు 23 ప్రాంతాల్లో రైడ్ చేసి రూ. 1 కోటికి మించి నకిలీ నోట్లను వారు సీజ్ చేశారు. నకిలీ నోట్ల ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రింటర్, మెషీన్‌లను రికవర్ చేసుకున్నారు.
 

rs 1 crore fake currency seized in rajastan.. printer, machine recovered
Author
New Delhi, First Published Jul 24, 2022, 4:00 AM IST

జైపూర్: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో చాలా వరకు కొత్త కరెన్సీ చలామణిలోకి వచ్చింది. పలు ప్రధాన లక్ష్యాలతోపాటు నకిలీ నోట్ల బెడదనూ ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నివారిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ, అవేమీ క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇచ్చినట్టు కనిపించడం లేదు. పాత కరెన్సీ ఉన్నప్పుడు ఎలాగైతే.. ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ జరిగిందో.. కొత్త కరెన్సీ వచ్చినప్పుడూ పాత ముఠాలు అలాగే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు అర్థం అవుతున్నది. తాజాగా, రాజస్తాన్‌లో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ సీజ్ చేశారు. అంతేనా.. నకిలీ కరెన్సీ తయారు చేయడానికి వినియోగించిన ప్రింటర్, ఇతర మెషీన్లను వారు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ కరెన్సీ ముద్రణ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. వారు అనుమానిస్తున్న ప్రాంతాలపై దాడులు చేయాలని భావించాయి.  బికనీర్‌లో 23 ప్రాంతాల్లో రాజస్తాన్ పోలీసులు రైడ్లు చేశారు. ఈ సోదాల్లో రూ. 1 కోటికి మించి నకిలీ నోట్లు లభించాయి. అంతేకాదు, నకిలీ నోట్ల ముద్రణ సాగిస్తున్న ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఫేక్ కరెన్సీ ముద్రించడానికి ఉపయోగిస్తున్న ప్రింటర్, మెషీన్‌లను రికవరీ చేసుకున్నారు. ఐజీ ఓం ప్రకాశ్ పర్యవేక్షణలో పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ రైడ్లు చురు పోలీసు స్టేషన్ ఏరియా, జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంతాల్లో చేపట్టారు. 

పోలీసుల వివరాల ప్రకారం, అరెస్టు చేసిన నిందితులు నోఖా, బికనీర్‌కు చెందినవారు. ఫేక్ కరెన్సీ రాకెట్‌ గుట్టరట్టు చేసిన ఆపరేషన్‌లో అనేక బికనీర్ పోలీసు బృందాలు ఉన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాాబాద్‌లోనే ఓ నకిలీ ముఠా గుట్టురట్టు అయింది. 

అద్దెకు ఉంటామని నెపంతో ఇంట్లోకి దూరి మహిళ మెడలోని బంగారు నగలతో ఉడాయిస్తున్న ముగ్గురు 
Interstate gang of thievesను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. Jewelry Recovery నిమిత్తం ప్రధాన సూత్రధారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా..  40 వేల రూపాయల Counterfeit currency దొరకడంతో..పోలీస్ లకు  అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. అలా దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. మొత్తం 11 మంది గ్యాంగ్ లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios