సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ పై ఒక కోటి రూపాయల పరువు నష్టం కేసు నమోదైంది. అలాగే, ఆయన ఆత్మకథ ప్రచురణ, పంపిణీ, విక్రయాలను వెంటనే నిలిపేసేలా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ అసోం ఏపీడబ్ల్యూ ప్రెసిడెంట్ అభిజీత్ శర్మ కోరారు. 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోయ్ పై రూ. 1 కోటి పరువునష్టం పిటిషన్ దాఖలైంది. అసోం పబ్లిక్ వర్క్స్ (ఏపీడబ్ల్యూ) ప్రెసిడెంట్ అభిజీత్ శర్మ ఈ పిటిషన్ వేశారు. రంజన్ గొగోయ్ తన ఆత్మకథలో తనకు వ్యతిరేకంగా, తన పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. అందుకే ఆయనపై పరువునష్టం కేసు నమోదు చేశారు. అలాగే, రంజన్ గొగోయ్ ఆత్మకథ ప్రచురితం కాకుండా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలనీ కోరారు.

రంజన్ గొగోయ్ జస్టిస్ ఫర్ ఎ జడ్జి అనే పేరుతో తన ఆత్మకథ రాసుకుంటున్నారు. ఈ ఆత్మకథను రూప పబ్లికేషన్స్ ప్రచురించనుంది. ఆ పుస్తకంలో ఏపీడబ్ల్యూ ప్రెసిడెంట్ అభిజీత్ శర్మ గురించి తప్పుగా స్టేట్‌మెంట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. గువహతిలోని కామరూప్ మెట్రోస్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. తనపై తప్పుడు వ్యాఖ్యలు ఉన్న ఈ పుస్తకాలు ప్రచురితం, పంపిణీ, విక్రయాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

Also Read: Supreme Court: మహారాష్ట్రలో ఎవరి ప్రభుత్వం ఉంటుంది? బీజేపీ.. ఎన్సీపీ దోస్తీ వదంతులకు ఫుల్‌స్టాప్?

మంగళవారం ఈ పిటిషన్‌లో వాదనలు విన్న తర్వాత బుధవారం ఓ రూలింగ్ ఇచ్చింది. పిటిషన్లు, డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత న్యాయాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉన్నదని తెలిసినట్టు కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ విచారణ జూన్ 3వ తేదీకి వాయిదా వేస్తూ ఇరుపక్షాలకు సమన్లు పంపింది.

అలాగే, ఇంజింక్షన్ ఆర్డర్‌ కావాలనే విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఎదుటి పక్షం వాదనలూ వినకముందే ఇంజంక్షన్ ఆర్డర్‌ పాస్ చేయాల్సిన అవసరం ఈ కేసులో కనిపించడం లేదని తెలిపింది.